Guppedantha Manasujune 29 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి అమ్మవారి దగ్గరికి వెళ్లి వసుధార గురించి మొక్కుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి, అమ్మవారి దగ్గర వసుధార గురించి చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. ఇలా అయినా వసుధారని నువ్వే కాపాడాలి అని చెప్పి అమ్మవారి దగ్గర వసు పేరుని రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడకు వసు వచ్చి తాను స్కాలర్ షిప్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యానని దానికి కారణం రిషి సర్ అంటూ అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది.
మరొకవైపు రిషి కోసం మహేంద్ర, జగతి కాలేజీలో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మహేంద్ర నా పుత్ర రత్నానికి నేనే కాల్ చేస్తాను అంటూ కాస్త ఓవర్ చేస్తాడు. అప్పుడు రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి జగతి నవ్వుతూ ఉంటుంది. మరొకవైపు వసుధార కూడా రిషీ పేరును అమ్మవారి దగ్గర రాస్తుంది.
మరొకవైపు జగతి మహేంద్ర ఫ్యామిలీ అందరూ కలిసి వసుధార కు సన్మాన సభ చేయాలి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు దేవయాని వసుధార విషయంలో వెటకారంగా మాట్లాడుతూ ఆకాశమంత పందిరి భూలోకమంత పీటలు వేసి మీడియా వాళ్ళని పిలిచి బాగా గ్రాండ్ గా చేయండి అనడంతో వెంటనే ఫణీంద్ర అలాగే చేయమని చెబుతాడు.
అప్పుడు జగతి వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. ఇంతలోనే రిషి రావడంతో రిషి పై దొంగ ప్రేమను చూపిస్తుంది. ఆ తర్వాత గౌతం వెళ్లి రిషి తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వసు గురించి లేనిపోని మాటలు చెబుతుంది. అప్పుడు దేవయానికి రిషీ గట్టిగా బుద్ధి చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత వసు పిల్లలకు ఆవకాయ అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు రిషీ కూడా తినిపించి నట్టు ఉంచుకుంటుంది. మరొకవైపు రిషి కూడా వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో ఫంక్షన్ మరికొద్ది సేపట్లో మొదలవుతుంది అనుకుంటూ ఉండగా ఇంతలోని రిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Read Also : Guppedantha Manasu june 28 Today Episode : స్కాలర్ షిప్ టెస్ట్ లో టాప్ వన్ లో వసు.. దగ్గరవుతున్న వసు, రిషీ..?