Guppedantha Manasu june 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషీ,వసు ఇద్దరు సరదాగా బయట పుచ్చకాయ తింటే మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో వసు ఇంటికి వెళ్దామా సార్ అని అనగా అప్పుడు రిషి వెటకారంగా సమాధానం చెబుతాడు. ఆ తర్వాత వారిద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు మహేంద్ర, జగతి కూర్చుని ఉండగా అప్పుడు జగతి తనలో తానే నవ్వుతూ మురిసి పోతూ ఉంటుంది.
అప్పుడు మహేంద్ర ఏంటి జగతి నీలో నువ్వేం నవ్వుకుంటున్నావ్ కారణం ఏంటో మాకు చెబితే మేము సంతోషిస్తాం అని అంటాడు. అప్పుడు జగతి వసు, రిషీ మళ్లీ దగ్గర అవుతున్నారు అని సంతోషపడుతుంది. అప్పుడు మహేంద్ర అప్పుడే సంతోషపడి పోకు జగతి మన రిషీ ఏ విషయాన్ని అంత ఈజీగా మర్చిపోడు.
ఉదాహరణగానే నీ విషయమే తీసుకో అని అనగా ఆ మాటలకు బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతూ ఉండగా అప్పుడు మహేంద్ర ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించిన జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వసుధార, రిషీ రాసిన లెటర్ ని చదువుతూ మురిసిపోతూ ఉంటుంది. ఏంటి రిషీ సార్ నాపై నీకు అంత కోపం అంటూ తనలోతానే మాట్లాడుకుంటూ ఉంటుంది.
అప్పుడు రిషి కి ఫోన్ చేయగా రిషి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే వసుధార తనతో మాట్లాడినట్లు ఊహించుకుంటున్నాడు. ఆ తర్వాత వసుకు తన ప్రపోజ్ చేసిన విషయం అన్ని విషయాలను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు రిషీ. రేపటి ఎపిసోడ్ లోపు చేసి కాలేజీ కి రాగా ఇంతలోనే ఫోన్ చేసి వసుధార స్కాలర్ షిప్ టెస్ట్ లో టాప్ లో ఉంది అని తెలియడంతో సంతోష పడుతూ ఉంటాడు.
నాకు తెలుసు వసు నువ్వు ఎలా అయినా సాధిస్తావు అని ప్రౌడ్ ఫీల్ అవుతూ అటుగా వెళ్తున్న వసు దగ్గరికి వెళ్లి చేయి పట్టుకొని కంగ్రాట్స్ లేషన్స్ అని చెబుతాడు. అసలు విషయం తెలియడంతో వసుధార కూడా ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు వసు ఈ గెలుపుకు మీరే కారణం ఆ రోజు అంతా మీరే నా వెంట ఉన్నారు అని అనడంతో అప్పుడు రిషి జరిగిన విషయాన్ని తెలుసుకుని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆ తర్వాత రిషీ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవైపు కాలేజీ స్టాప్ వసు విషయం గురించి మాట్లాడుతూ ఆనందంగా ఉంటారు. అప్పుడు వసు గెలుపుకు నేను కాదు రిషీ సార్ కారణం అని జగతి అనగా ఆ మాటలు రిషి విని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు వసుధార ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత జగతి మహేంద్ర దగ్గరకు వచ్చి టెస్టులు వసుధా పాస్ అయినందుకు మినిస్టర్ గారు అభినందించడం తోపాటు ఈ సందర్భంగా మరొక సామాజిక కార్యక్రమం చేయమని చెప్పారు అని అనడంతో వారిద్దరు సంతోషంగా ఫీల్ అవుతూ ఆ విషయాన్ని రిషీతో మాట్లాడడానికి బయలుదేరుతారు.
మరొకవైపు రిషీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి తన మనసులో మాటలను అమ్మవారికి చెప్పుకొని బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు రిషీ అమ్మవారి దగ్గర వసు పేరును రాసి తనని నువ్వే కాపాడాలి నువ్వే రక్షించాలి అని అంటాడు. ఆ తరువాత వసు అక్కడికి వచ్చి రిషీ పేరును రాస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.