Guppedantha Manasu june 30 Today Episode : తెలుగు పులి ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు అభినందించడం కోసం గౌతమ్, రిషి, ధరణీ ముగ్గురు వసు ఇంటికి వెళ్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార నీళ్ళ బిందె తెస్తూ కష్ట పడుతూ ఉండగా ధరణి సహాయపడుతుంది. ఆ తర్వాత గౌతమ్, రిషి, ధరణీ కంగ్రాట్యులేషన్స్ చెప్పి వసుధారకు స్వీట్ తినిపిస్తారు. ఆ తరువాత గౌతమ్ అక్కడ కొద్దిసేపు కామెడీ చేస్తూ ఉండగా రిషి మాత్రం చిరాకుగా కనిపిస్తాడు. మరొకవైపు ఫణీంద్ర ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఆ గుడ్ న్యూస్ ఏంటో చెబితే మేము కూడా వింటాము కదా అని అనడంతో ఫణీంద్ర కొద్దిసేపు దేవాన్ని ఆట పట్టించినట్లుగా మాట్లాడతాడు.
ఇంతలోనే ధరణి, గౌతమ్, రిషి రావడంతో అప్పుడు దేవయాని ధరణి చెప్పకుండా బయటికి వెళ్లినందుకు ధరణిపై కోప్పడుతుంది. అప్పుడు రిషి నేనే వదినని పిలుచుకెళ్ళాను అని అనడంతో దేవయాని మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు వారందరూ వసుధార గురించి గొప్పగా పొగుడుతూ ఉండగా అప్పుడు దేవయాని కుళ్ళుకుంటుంది.
ఇక వెంటనే దేవయాని వసుధార గురించి వెటకారంగా మాట్లాడడంతో ఫణింద్ర కూడా దేవయానికి వెటకారంగా సమాధానం చెబుతాడు. మరొకవైపు అందరూ వసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పుష్ప వెళ్ళి వసు తో సన్మాన సభకు సంబంధించిన పనిలో అన్ని రిసీ సార్ దగ్గర నుండి చూసుకుంటున్నాడు అనడంతో వసు సంతోషపడుతుంది.
రిషి సార్ కి నాపై కోపం తగ్గిపోయినట్లు ఉంది అని అనుకుంటుంది. మరొకవైపు రిషి, మహేంద్ర జగతి లతో మాట్లాడుతూ ఈ సన్మాన సభను ఎక్కువ హంగులు ఆర్బాటలు లేకుండా సింపుల్ గా చేయండి అని చెబుతాడు. ఇంతలోనే వసుధార అక్కడికి రావడంతో వసు వైపు చూస్తూ ఉంటాడు.
జగతి దంపతులు మాట్లాడుతున్న పట్టించుకోకుండా వసు వైపు చూస్తూ ఉంటాడు. రిషి చూపులను గమనించి జగతి దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత జగతి వెళ్లి వసుధారతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి అక్కడే ఉంటే వసుధార జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి అని వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు వసు అడ్డుపడినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు.
రేపటి ఎపిసోడ్ లో రిషి మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని,సాక్షి ఇద్దరు కుట్రపన్ని వసుకి రిషి ప్రపోజ్ చేసిన వీడియోని అందరి ముందు బయట పెట్టడంతో రిషి అవమానంగా ఫీల్ అవుతూ వసుధారపై సీరియస్ అవుతాడు. సాక్షి చేసిన పనికి వసుధారనే ప్లాన్ చేసింది అనుకొని వసుధారపై మండిపడతాడు.