...

Guppedantha Manasu july 6 Today Episode : సినిమాకి వెళ్తున్న రిషి, సాక్షి.. కోపంతో రగిలిపోతున్న వసుధార..?

Guppedantha Manasu july 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి,వసు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న,జగతి మహేంద్ర ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషిని ఎందుకు నా మెసేజ్ కి రిప్లై ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఇక వారిద్దరి మాటలు వింటున్న జగతి దంపతులు ఆనందంతో మురిసిపోతూ ఉంటారు. ఆ తర్వాత మహేంద్ర, జగతి ఇద్దరూ వసు, రిషి ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో జగతి అక్కడికి వెళ్లి వసుతో కలిసి భోజనం చేద్దాము అని అడుగుతుంది.

Advertisement
Guppedantha Manasu july 6 Today Episode
Guppedantha Manasu july 6 Today Episode

అప్పుడు వసు వాళ్ళతో కలిసి భోజనానికి కూర్చుంటుంది. రిషి సార్ భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని జగతి వాళ్ళను అడుగుతూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. ఆ తర్వాత మహేంద్ర వర్మను రిషి కార్ కీస్ అడగగా మీ కారు ఏమయింది అని అడుగుతుంది వసుధార. అప్పుడు రిషి వెటకారంగా సమాధానం చెప్పి ఎక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

ఆ తర్వాత మహేంద్ర అభినందన సభలో రిషికి ఎందుకు పూలదండ వేశావు అని అనగా ఏం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది. ఆ తర్వాత రిషి విషయంలో దేవయాని,సాక్షి ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ను చెప్తారు. సాక్షి రిషి ప్రేమ కోసం సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అంటూ హైడ్రామా క్రియేట్ చేసి ఆ విషయాన్ని రిషి చెప్పడంతో వెంటనే రిషి షాక్ అయ్యి దేవయానితో నీకు గతంలోనే చెప్పాను కదా పెద్దమ్మ అంటూ సీరియస్ అవుతాడు.

Advertisement

అప్పుడు దేవయాని సరే అంటూ సాక్షిని ప్రేమించక పోయినా, పెళ్లి చేసుకోకపోయినా కనీసం ఫ్రెండ్ లాగా అయినా ఉండు అని అంటుంది. ఆ తర్వాత రిషి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో సాక్షి, దేవయాని వారి ప్లాన్ సక్సెస్ అయ్యింది అనుకోని నవ్వుతూ ఉంటారు . ఆ తర్వాత మహేంద్ర వర్మ దేవయానితో మాట్లాడుతూ సాక్షి ఎందుకు ఆ విధంగా చేసుకుంది అని అనగా వెంటనే రిషి ఇక టాపిక్ గురించి మాట్లాడకండి అని చెబుతాడు.

Advertisement

ఆ తర్వాత అక్కడ నుంచి తన రూమ్ కి వెళ్ళిన రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మెసేజ్ చేయడంతో రిషి వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే వసుధార, రిషికి ఫోన్ చేసి నేను ఈరోజు కాలేజీకి రావడం లేదు ఇవాళ మొత్తం రెస్టారెంట్ లోనే ఉంటాను అని చెబుతుంది. అప్పుడు రిషి అది నాకెందుకు చెబుతున్నావు అని అనడంతోనే వెంటనే వస్తదార ఫోన్ కట్ చేస్తుంది.

Advertisement

ఆ తర్వాత రిషి ఆలోచిస్తూ నన్ను ఇండైరెక్టుగా రమ్మంటుందా అని సాక్షికి ఫోన్ చేసి కాఫీ తాగడానికి వెళ్తున్నాను అని చెబుతాడు. ఆ తర్వాత సాక్షి తనను రమ్మంటున్నాడా అనుకొని తాను కూడా వెళ్లాలి అనుకుంటుంది. మరొకవైపు వసుధార రిషి కోసం రెస్టారెంట్ లో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సాక్షి రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అది చూసిన వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

అప్పుడు రిషి సాక్షి సినిమాకి వెళ్దామా అనడంతో పసుధార ఇంకా షాక్ అవుతుంది. ఆ తర్వాత సాక్షి రిషి తో సీట్ బెల్టు పెట్టించుకోవడంతో అది చూసిన వసు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Guppedantha Manasu: సాక్షికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన వసు..రిషిని గట్టిగా నిలదీసిన వసు..?

Advertisement
Advertisement