Guppedantha Manasu july 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి కోసం రెస్టారెంట్లో ఎదురుచూస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసు రెస్టారెంట్ లో ఒకచోట కూర్చొని రిషి గురించి ఆలోచిస్తూ గులాబీ రెక్కలతో లవ్ సింబల్ వేస్తుంది. ఇంతలో తాను వేసిన లవ్ సింబల్ ని చూస్తూఉండడంతో ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు వసు రిషి నీ వేరే టేబుల్ మీద కూర్చోమని చెప్పి ఆ టేబుల్ కు అడ్డంగా నిలబడి తాను గులాబీ రెక్కలతో చేసిన లవ్ సింబల్ ను చెరిపేస్తుంది.

ఆ తర్వాత రిషి ఆ టేబుల్ మీద కూర్చొని గులాబీ రెక్కలను చూసి ఏంటివి అనడంతో గులాబీ రెక్కలు అని అంటూ వెటకారంగా సమాధానం ఇస్తుంది వసుధార. అప్పుడు రిషి కూడా గులాబీ పూలతో లవ్ సింబల్ ను వేయటంతో వసుధార ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత వసు ని కాఫీ తెమ్మని చెప్పడంతో వసు కాఫీ చేయడానికి వెళుతుంది. ఇక కాఫీ తీసుకొని తిరిగి వచ్చేలోగా అక్క రిషి పక్కలో సాక్షి ఉండటంతో చూసి షాక్ అవుతుంది.
Guppedantha Manasu : వసుని గెట్ అవుట్ అంటూ అవమానించిన జగతి..
ఇక వసుధార అక్కడి నుంచి పక్కన టేబుల్ వారికి సర్వ్ చేస్తూ వారిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ వింటూ ఉంటుంది. మరొకవైపు దేవయానికి కావాలనే గౌతం కు ఒక పని అప్పజెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత వసు,రిషి సాక్షి సినిమాకి ఎలా వెళ్తారు అని మనసులో అనుకుని కావాలనే వెళ్లి రిషి కారు పంచర్ చేస్తుంది. ఆ తర్వాత రిషి, సాక్షి ఇద్దరు బయటకు వెళ్ళగా అప్పుడే వసు కూడా వచ్చి బాయ్ సార్, బాయ్ సాక్షి అని అంటుంది.
ఆ తర్వాత కారు పంచర్ అవడంతో అప్పుడు సాక్షి పంచర్ అయిందో లేకపోతే కావాలని ఎవరైనా చేశారో అనడంతో రిషి, వసు వైపు చూస్తాడు. అప్పుడు వెంటనే ఏంటి సార్ నేనే చేశాను అనుకుంటున్నారా నాకేం అవసరం ఉంది అని అంటుంది వసు. ఆ తర్వాత గౌతం రాడు అని తెలుసుకున్న రిషి కారు పంచర్ అయింది గౌతమ్ రావడం లేదు నాకు రావడానికి మూడు లేదు అనడంతో సాక్షి అప్సెట్ అవుతుంది.
ఇంతలోనే అక్కడికి జగతి, మహేంద్ర వస్తారు. అప్పుడు రిషి సాక్షిని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేయమని మహేంద్రకు చెప్పడంతో మహేంద్ర సాక్షిని తీసుకెళ్తాడు. ఆ తర్వాత జగతి, వసు ఇద్దరూ రెస్టారెంట్ లో జరిగిన విషయం గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. రేపటి ఎపిసోడ్ లో క్లాసులో వసు రిషి గురించి తలుచుకుంటూ ఉండగా ఇంతలో అటుగా రిషి వస్తాడు.
మళ్లీ వెనక వస్తాడు అంటూ కళ్ళు మూసుకొని వెళ్ళు లెక్కపెడుతూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి క్లాస్ వినకుండా ఏం చేస్తున్నావ్.. గెట్ అవుట్ ఫ్రం మై క్లాస్ అంటూ వసుధార ని బయటకు పంపించేస్తుంది. దానితో వసుధార ఎమోషనల్ అవుతుంది.
Read Also : Guppedantha Manasu july 6 Today Episode : సినిమాకి వెళ్తున్న రిషి, సాక్షి.. కోపంతో రగిలిపోతున్న వసుధార..?