Guppedantha Manasu july 8 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో బాగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, జగతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి అక్కడికి వస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి, మేడం మీ క్యాబ్ బుక్ చేశాను వెళ్ళండి అని జగతితో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు జగతి, వసుతో మాట్లాడుతూ నీ మీద నీకు క్లారిటీ ఉంటే ఇలా కడుపు మండుతుందా అని అనగా వెంటనే వసు క్లారిటీ ఉంది కాబట్టి కడుపు మండుతుంది అని అంటుంది. అప్పుడు జగతి నీ మీద నీకు క్లారిటీ లేదు అని గట్టిగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత వసుధార ఇంటికి ఆటోలో వెళుతూ రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రిషి కూడా వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే దేవయాని సాక్షి ఇద్దురు, రిషి గురించి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సాక్షి,రిషి సినిమాకు వస్తాను అని చెప్పి చివరి క్షణం లో మనసు మార్చుకున్నాడు అని నిరుత్సాహపడుతూ ఉండగా అప్పుడు దేవయాని అప్పుడే నిరుత్సాహపడకు రిషి ఇష్టాలన నువ్వు కూడా ఇష్టంగా మార్చుకోవాలి రిషి ని మారాలి అంటే ఇంకా చాలా సమయం పడుతుంది అని రిషి విషయంలో సలహాలు ఇస్తుంది దేవయాని.
Guppedantha Manasu : రిషి ఆలోచనలతో మైమరచిపోతున్న వసు!
మరొకవైపు మహేంద్ర, జగతి దగ్గరికి వచ్చి వసు, రిషి ల గురించి అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ మళ్లీ ఒకటి అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ విషయంలో మనం ఇంకా ఏం చేయడానికి లేదు అని జగతి అంటుంది. ఆ తర్వాత గౌతమ్, వసుధార కాలేజీకి పైన పనిచేస్తున్నారు అని తెలుసుకున్న రిషి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు అని అడగగా కొలతలు అంటూ వసు సమాధానం చెప్పడంతో రిషి కాస్త వెటకారంగా సమాధానం చెబుతాడు.
ఆ తర్వాత రిషి మహేంద్ర దంపతులకు అక్కడ ఏం జరుగుతుంది అనగా ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు అని మహేంద్ర వర్మ చెప్పడంతో ఫస్ట్ వసుధారని అక్కడి నుంచి రమ్మని చెప్పండి అని జగతికి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి. అప్పుడు మహేంద్ర కూడా జగతిని ఆటపట్టించినట్లుగా మాట్లాడుతాడు. మరొకవైపు జగతి క్లాస్ చెబుతూ ఉండగా అప్పుడు వసు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో జగతి క్లాస్ వినకుండా ఏం చేస్తున్నావ్ వసు అంటూ గట్టిగా అరిచి క్లాసు లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఆ తర్వాత రిషి తన క్యాబిన్ కు వెళ్ళగా అక్కడ సాక్షి ఉండడంతో సాక్షిపై విరుచుకుపడతాడు. ఇప్పుడు సాక్షి రిషి క్యాబిన్ లో లవ్ సింబల్ ను కింద పడేయడంతో సాక్షిపై విరుచుకుపడిన రిషి, ఆ తర్వాత దేవయాని మాటలు గుర్తుకు వచ్చి కూల్ గా మాట్లాడుతాడు. రేపటి ఎపిసోడ్ లో వసు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆ విషయాన్ని గౌతమ్ రిషికి చెప్పడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుని కారులో ఎక్కించుకొని ఇంటిదగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు రిషి..
Tufan9 Telugu News And Updates Breaking News All over World