Guppedantha Manasu Aug 26 Today Episode : రిషికి ప్రామిస్ చేసిన వసుధార..రిషి కౌగిట్లో వసు…?

Guppedantha Manasu Aug 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషికీ ప్రపోజ్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసుధార నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. ఈ మాట ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో భయం వేస్తుంది సార్ అంటూ తన చేతిలో ఉన్నది గిఫ్ట్ రిషికీ ఇస్తుంది. రిషి ఆ గిఫ్ట్ ను చూస్తూ సంతోషంతో ఇక ఇప్పటినుంచి ఈ బొమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది వసుధార అని అంటాడు. దాంతో వసుధార ఎంతో సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి వర్షం ఎక్కువగా వస్తుంది అని వసునీ పక్కకు తీసుకొని వెళ్తాడు రిషి.

మరొకవైపు మహేంద్ర జగతి ఇద్దరూ రిషి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జగతి వసు ఈరోజు తన మనసులోని మాట రిషి కీ చెబుతాది. ఒకవేళ అలా జరగకపోతే పరీక్షల తర్వాత వీలు ఇంకా కలవడానికి అవకాశం ఉండదు అని అంటుంది జగతి. అలా వారిద్దరూ కాసేపు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు రిషి,వసుధార ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Guppedantha Manasu Aug 26 Today Episode : రిషి కౌగిట్లో వసుధార….

అప్పుడు రిషి ఎప్పటికీ మనిద్దరం ఇలాగే కలిసి ఉండాలి. జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఉండాలి అని అనటంతో వసు సరే అని అంటుంది. అప్పుడు రిషి ఆరోజు నువ్వు నన్ను కాదన్నావు నిన్ను ఎవరు బెదిరించారు అని అడగగా వసు మౌనంగా ఉంటుంది.

అప్పుడు రిషి నేను ఇప్పుడే మనమధ్య దాపరికాలు వద్దు అన్నాను అనటంతో వెంటనే వసుధార సాక్షి బెదిరించింది సార్ అని చెబుతుంది. ఆ తర్వాత ఆ రిషి మన ప్రేమ కొనసాగాలి నువ్వు నీ ప్రేమను త్యాగం చేయాలి వసు అనడంతో పసుధార షాక్ అవుతుంది. మన ప్రేమ నీ చదువుకు అడ్డం కాకూడదు అని నేను అనుకుంటున్నాను అంటూ పసుధార దగ్గర ప్రామిస్ తీసుకుంటారు రిషి.

అప్పుడు వసుధార రిషి మాటలకు ఓకే అనడంతో రిషి సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉరుములు రావడంతో వసూలు వెళ్లి ఒక్కసారిగా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత రిషి, వసు నీ దగ్గరికి తీసుకొని ఈ పంచభూతాల సాక్షిగా ఈ నిమిషం నుంచి మనిద్దరం ప్రేమ అనే ప్రయాణం మొదలు పెడదాము అని అంటాడు. అలా వారిద్దరూ కౌగిట్లో కాసేపు మునిగితేలుతూ ఉంటారు.

Advertisement

Read Also : Guppedantha Manasu Aug 25 Today Episode : సూపర్ ట్విస్ట్.. రిషికి ప్రపోజ్ వసు..ఆనందంలో రిషి..?

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel