Guppedantha Manasu serial Oct 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ వసు, రిషి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో వసు సర్ ఇక్కడ మనం ఇలా కూర్చుని జామకాయలు తింటూ మాట్లాడుకోవడం చాలా బాగుంది కదా సార్ అని అనగా, వెంటనే రిషి బాగుంది కానీ నువ్వు జామకాయ గురించి పూర్వపరాలు అన్ని చెబుతావేమో అనిపిస్తుంది అనటంతో వసుధర కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు వసుధారా సర్ జామకులు తింటే చాలా మంచిది అని అనగా వెంటనే జామాకులు తర్వాత ముందు జామకాయలు తిందామా అని జామకాయలు తింటూ ఉంటారు.

Rishi appreciates Vasudhara for dropping him home in todays guppedantha manasu serial episode
అప్పుడు వారిద్దరూ జామకాయలు తింటూ ఉండగా అప్పుడు రిషికి కారం అవడంతో వసుధర తాగడానికి నీళ్లు ఇస్తుంది. అప్పుడు వసుదానా రిషి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే వసుధార గురుదక్షిణ ఒప్పందం గురించి మాట్లాడటంతో రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసుధారా ఎక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇంతలో రిషి మళ్ళీ వెనక్కి వచ్చి కారు పంచర్ అయింది లిఫ్ట్ కావాలి అని అడుగుతాడు.
ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తానో మీరు వెనకాల కూర్చోండి అని అనగా రిషి లేదు నేనే డ్రైవ్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ బైక్ లో వెళ్తూ ఉండగా రిషి మాత్రం వెనుతిరిగి వెనుక వైపు కూర్చుని ఉంటాడు. అప్పుడు రోడ్డుపై వెళ్తూ ఉంటే అందరూ నవ్వుతూ ఉండగా వెంటనే రిషి బైక్ ఆపు వసు అని అంటాడు. అప్పుడు రిషి డ్రైవ్ చేస్తూ ఉండగా వెనకాల వసు కూర్చుని ఉంటుంది.
గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్ 6 ఈరోజు ఎపిసోడ్ :వసుధార, రిషీ రొమాంటిక్ సీన్.. రిషి పూర్తిగా మారిపోయాడంటూ ఎమోషనల్..
ఆ తర్వాత రిషి వసుధారకి ఒక చిన్న బొమ్మను ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు వసుధార ఆ బొమ్మ చూస్తూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రిషి మళ్ళీ వస్తాడు. అప్పుడు రిషి వసు నీ పక్కన కూర్చోమని చెప్పి వసుధారకు తన బాధను గురించి చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు రిషి కాస్త ఎమోషనల్ గా మాట్లాడడంతో వసుధార కూడా బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు రిషి మనిద్దరం జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది వసుధార కానీ మన మధ్యలో ఈ ఒక్క విషయం ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని అంటాడు. అప్పుడు వసుధర ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు ఇద్దరు ప్రేమ గురించి మాట్లాడుకుటు ఉంటారు. నువ్వు వచ్చిన తర్వాత ఈ రిషి పూర్తిగా మారిపోయాడు వసుధార అందరికీ పాటలు చెప్పే నేను నీ దగ్గర నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నాను అని అంటారు రిషి.
అప్పుడు మన మధ్య ఎందుకు ఈ దూరం వసుధార అని అడగగా వెంటనే వసు మీరు జగతి మేడంని అమ్మ అని పిలిస్తే అని అనడంతో వెంటనే రిషి కోపంతో గట్టిగా అరుస్తాడు. అప్పుడు అందులో తప్పేముంది సార్ అని అనడంతో నేను ఏం కోల్పోయాను నీకేం తెలుసు అని వసుధారపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.