Guppedantha Manasu serial Oct 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవ్వుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు,చేసే అల్లరి పనులను వీడియో తీస్తూ మురిసిపోతూ ఉంటాడు రిషి. ఈరోజు ఎపిసోడ్ వసు, రిషి క్యాబిన్ లో అల్లరి పనులు చేస్తూ ఉండగా రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటూ వీడియో తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార సీట్ లో కూర్చోవడంతో రిషి మరింత ఆశ్చర్యపోతాడు. రిషి సీట్ లో కూర్చుని రిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి అదంతా కూడా వీడియో తీస్తూ ఉండగా ఇంతలోనే రిషి కి ఫోన్ రావడంతో వసుధార ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.
ఇక్కడ ఏం చేస్తున్నావు అని రిషి అనగా, ఏం లేదు సార్ అని పారిపోతుంది వసు. అప్పుడు రిషి ఆ చాక్లెట్ ని తీసుకొని చాక్లెట్ తినడం కూడా ఒక ఆర్ట్ అని అనుకుంటాడు. మరొకవైపు మహేంద్ర జగతి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. మేడం మీరు ఇక్కడున్నారు ఏంటి?మిషన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లలేదా అని అడగగా మహేంద్ర, జగతికి కొంచెం తలనొప్పిగా ఉంది అని వెళ్ళ లేదు అనడంతో మరి వసుధార ఒక్కతే వెళ్లిందా అని అడుగుతాడు రిషి.
అందుకు మహేంద్ర వాళ్ళు అవును అని అనడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు రిషి అక్కడి నుంచి వసు కోసం బయలుదేరుతాడు. మరొకవైపు వసుధార డ్రైవింగ్ లో ఉండగా రిషి పదేపదే ఫోన్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా వసుధారని లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత వసు తాను వెళ్లాల్సిన చోటికి వెళ్లి ఒక చోట బండి పెట్టి ఫోన్ చెక్ చేయగా రిషి నుంచి చాలా మిస్డ్ కాల్ వచ్చి ఉంటాయి.
గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్ 5 ఈరోజు ఎపిసోడ్ : రిషికి మరో పెళ్లి సంబంధం కోసం దేవయాని స్కెచ్..
అప్పుడు రిషి వసు నీ ఫాలో అవుతూ వసు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఒకదానివి వచ్చావు భయం లేదా సార్ అని అడగగా భయం ఏమి లేదు సార్ అని అంటుంది వసుధార. అక్కడికి వచ్చి వసుధార నీ, రిషినీ పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు వసుధారా రిషి ఇద్దరు పొలం గట్టుమీద నడుస్తూ ఉండగా వసుధార జారి కింద పడిపోతూ ఉండడంతో రిషి పట్టుకుంటాడు.
అప్పుడు కిషోర్ అనే అతను పల్లెటూరికి కొత్తగా వచ్చారు కదా అమ్మ అలవాటు లేనట్టు ఉంది అని అనడంతో వసుధర తాను కూడా పల్లెటూరి అమ్మాయిని అని మొదలు పెడుతుంది. ఇప్పుడు వెనకాలే ఉన్న రిషి మొదలుపెట్టింది రా బాబు అని అనుకుంటూ ఉంటాడు.. ఆ తర్వాత రిషి, వసు ముందర చూసి జాగ్రత్తగా నడుచు అని చెప్పి రిషినే పడిపోతూ ఉండడంతో వెంటనే వసు పట్టుకుంటుంది.
తర్వాత రిషి పడిపోతున్నందుకు వసు నవ్వుతూ ఉంటుంది. మరొకవైపు మహేంద్ర ఒంటరిగా కూర్చొని రిషి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు ఏమైంది మహేంద్ర అలా ఉన్నావు నేను ఇచ్చిన డోస్ సరిపోలేదా అని అంటుంది. అప్పుడు దేవయాని నువ్వు ఒక పని చెయ్యి మహేంద్ర, వసునీ మర్చిపోమని రిషికీ చెప్పు నేను ఆ సాక్షిని మర్చిపోతాను అని అనడంతో మహేంద్ర ఒకసారిగా షాక్ అవుతాడు.
మన రిషికి ఒక గొప్పింటి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాము అని అనడంతో మహేంద్ర దేవయానివైపు కోపంగా చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా అయినా రిషి ని వేరే సంబంధానికి ఒప్పించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. అప్పుడు జగతి కీ దేవయాని ఎదురుపడి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.
మరొకవైపు వసూ రిషి ఊరు మొత్తం తిరిగి అలసిపోయి ఒకచోట కూర్చుంటారు. అప్పుడు కిషోర్ సార్ మా జామ చోట చూసి వద్దాం రండి అని పిలవడంతో నాకు ఓపిక లేదు అని అంటాడు రిషి. అప్పుడు అతను మీరు ఇక్కడే ఉండాలని ఇప్పుడే వస్తాను అని చెప్పి వారికోసం జామకాయలు ఉప్పును తీసుకుని రావడంతో వసుధార ఎంతో ఆశగా అవి తీసుకుంటుంది. ఆ తర్వాత కిషోర్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వసుధార, రిషి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World