Guppedantha Manasu serial Oct 4 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసుధార గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసుధార మెసేజ్ చేస్తుంది. అప్పుడు వసుధార క్యాంపు కి ఏ ఏ ప్రదేశాలకు వెళ్లాలో లిస్టు పెడుతుంది. అప్పుడు రిషి ఎప్పుడు వెళ్దాము అని మెసేజ్ చేయగా మీ ఇష్టం సర్ అని మెసేజ్ చేస్తుంది వసుధార. అప్పుడు రిషి పిలుస్తాడు అనే వసుధర, వసుధార నేను వస్తాను అని అడుగుతుంది అని రిషి ఒకరి గురించి ఒకరి మనసులో అనుకుంటూ ఉంటారు.
నువ్వు, జగతి మేడం వెళ్లి వచ్చేయండి అని రిషి మెసేజ్ చేస్తాడు. అప్పుడు వసుధార ఆశ్చర్య పోతుంది. మరొకవైపు జగితి మహేంద్రలు కాలేజీకి వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటారు. అప్పుడు రిషి కింద హాల్లోకి వస్తాడు. అప్పుడు రిషి మహేంద్ర తో మాట్లాడడానికి చూస్తాడు. అప్పుడు మహేంద్ర జగతిని పిలుచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి మహేంద్ర తో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని జగతి గమనించి ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
అప్పుడు మహేంద్ర, రిషిలు ఇద్దరు బయటకు వచ్చి ఆగుతారు. అప్పుడు రిషి పెద్దమ్మ విషయంలో అలా మాట్లాడినందుకు డాడ్ ఇలా ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర రిషి నేను నిన్న స్వారీ అడిగినందుకు బాధపడటం లేదు నీకోసం, మీ ఆనందం కోసం ఒకటి కాదు వంద సార్లు సారీ చెప్పమన్నా చెబుతాను అని అంటాడు మహేంద్ర.
గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్ 4 ఈరోజు ఎపిసోడ్ : వసుధార చిలిపి పనులను చాటుగా వీడియో తీసిన రిషీ..
తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి డాడ్ నాకు వసుధార అంటే ఇష్టం తను నాకు కావాలి తాను తాను గానే కావాలి ఒప్పందాలు ఏవి వద్దు అని అంటాడు రిషి. నేను వసుధారణి ఏ విషయం కోసం వదులుకోవాలి అనుకోవడం లేదు డాడ్ అని మహేంద్రను హత్తుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి. అప్పుడు మహేంద్ర రిషి కోసం ఆలోచిస్తే జగదీకి అన్యాయం జరుగుతుంది జగతి కోసం ఆలోచిస్తే వీళ్ళ ప్రేమ పోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర.
తర్వాత వసు జగతిని క్యాంపుకు వెళ్దాం పదండి మేడం అని అనగా నాకు హెల్త్ బాగోలేదు నేను రాలేను వసు అనడంతో సరే మేడం నేను వెళ్తాను అని అంటుంది వసుధార. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే మహేంద్ర,రిషి వస్తారు. అప్పుడు రిషి ఆ టూ వీలర్ బైక్ ని చూస్తాడు. బైక్ వెనుక విఆర్ అని రాసి ఉంటుంది. అప్పుడు మహేంద్ర మీరిద్దరూ క్యాంపుకు వెళ్తున్నారా అని అనగా వెంటనే వసుధార లేదు సార్ మేడంకు ఒంట్లో బాగాలేదట నేను వెళ్తున్నాను అని అంటుంది.
ఇప్పుడు మహేంద్ర నేను వస్తాను అనడంతో జగతి వద్దు కాలేజీలో పనులు ఉన్నాయి పూర్తి చేయాలి అని అంటుంది. ఆ తర్వాత వసుధర రిషి క్యాబిన్ కి వెళుతుంది. అక్కడ రిషి లేకపోవడంతో రీషి కూర్చున్న కూర్చితో అక్కడున్న వస్తువులతో వసుధార మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు వింటున్న రిషి చాటుగా ఉంటూ వీడియో తీస్తూ ఉంటాడు. అప్పుడు రిషి గురించి పొగుడుతూ రిషి కుర్చీలో కూర్చుంటుంది. అదంతా కూడా రిషి వీడియో తీస్తూ ఉంటాడు.
Read Also : God Father First Review : గాడ్ ఫాదర్‌కు చెత్త రివ్యూ.. నీ ఫేక్ రివ్యూలు ఆపేయ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World