Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార రిషి మాట్లాడుకుంటూ ఉండగా రిషి అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి దారిలో కోపంగా నడుచుకుంటూ వెళ్తూ వసుధార అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలోనే గౌతమ్ అక్కడికి వచ్చి కార్లో ఎక్కించుకొని వెళ్తాడు. అప్పుడు వారిద్దరూ వెళ్తూ ఉండగా వసుధర ఫోన్ చేయడంతో రిషి వెంటనే ఫోన్ లాక్కొని ఏంటిది అని ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు గౌతమ్ ఏం జరిగింది అని అనడంతో రిషి గౌతమ్ పై కోప్పడతాడు.
ఆ తర్వాత ఇంటికి వెళ్లిన రిషి వసు అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వసు ఇక మారదా అని ఆలోచిస్తూ ఉండగా కిందన మహేంద్ర ఒంటరిగా పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉండగా రిషి అక్కడికి వెళ్తాడు. అప్పుడు మహేంద్ర రిషి అన్న మాటలు దేవయాని చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.
అప్పుడు రిషి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని అడగగా అప్పుడు మహేంద్ర కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచించకుండా నిద్రపోవాలని ఉంది రిషి అని అర్థంతో రిషి నావల్లే నా డాడ్ అని అనగా కాదు రిషి అని అంటాడు మహేంద్ర. అప్పుడు వారిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు రిషి మహేంద్ర ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు.
అప్పుడు మహేంద్ర రిషికి ధైర్యం చెబుతూ ఉంటాడు. అది చూసిన జగతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం వసుధార రిషి అన్న మాటలు తనపై చూపిస్తున్న కేరింగ్ విషయం గురించి తలుచుకుని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఆటో అతనికి ఫోన్ రావడంతో పక్కకు ఆటో ఆపి మాట్లాడు కాసేపు నేను వెయిట్ చేస్తాను అనడంతో అతడు వసు ని పొగుడుతూ మాట్లాడతాడు.
ఆ తర్వాత రిషి,వసు ఒక చెట్టు కింద ఒకరికి తెలియకుండా ఒకరు కూర్చుని ఉంటారు. అప్పుడు రిషి, వసు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు వసు ని చూసి ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని అడగగా వసుధార ఆ బొమ్మలను చూపించి బొమ్మల కొలువు కోసం ఈ బొమ్మలను రెడీ చేస్తున్నాను సార్ అని అంటుంది.
అప్పుడు రిషి వసుధర ఆనందాన్ని చూసి నువ్వు చిన్న చిన్న వాటిలో కూడా గొప్ప గొప్ప ఆనందాలను వెతుక్కుంటావు కదా అని అంటాడు. అప్పుడు వసుధార చేతిలో ఉన్న బొమ్మలను తీసుకున్న చూస్తూ ఉండగా రాజు రాణి పక్కనే ఉండాలి సార్ అని అనడంతో మరి సైన్యం ఏది అని అనగా మీదే నా సైన్యం అని అంటుంది వసు.
ఆ తర్వాత వారిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్లు మళ్ళీ జగతి విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి, వసు కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు అమ్మని అమ్మ అని పిలవడానికి మీకు ఎందుకు అంత అని అనగా గట్టిగా వసుధార అని అరుస్తాడు రిషి. అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
లోపలికీ వెళ్లిన రిషి, వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రిషి తన క్యాబిన్లో వసూ చేసిన చిలిపి పనుల వీడియో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇంతలోనే వసు అక్కడికి వచ్చి సార్ ఇది ఎప్పుడు తీశారు అని అడగడంతో వెంటనే రిషి సెల్ ఫోన్ దాచిపెట్టుకుంటాడు. అప్పుడు రిషి ఆ వీడియోలను వసుధర అన్న మాటలు ఒక్కొక్కటిగా చెబుతూ ఉంటాడు.