...

Mango Price: రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్న మామిడి… ధరలు తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ!

Mango Price: వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు మామిడి పండ్లు తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే ఈ ఏడాది మామిడి పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పాలి. సామాన్యులకు ఈ ఏడాది మామిడి పండు కొనాలంటే అధిక భారం అవుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మామిడి ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి. ఈ ఏడాది మామిడి పండ్లు ధర 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. మామిడిపండ్ల దిగుమతి పూర్తిగా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ప్రతి ఏడాది వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మామిడికి ఎంతో ఫేమస్. ఈ మార్కెట్ నుంచి మామిడి పండ్లు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్ము కాశ్మీర్, నేపాల్ వంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ఇక మామిడి పండ్లలో బంగినపల్లి మామిడి పండుకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. బంగినపల్లి మామిడి పండు రుచికి మారుపేరు. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా మామిడి పిందె దశలోనే రాలిపోవడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఇలా పంట దిగుబడి తగ్గడంతో మామిడి ధరలకు అమాంతం రెక్కలు వచ్చేసాయి.

గత ఏడాది ఇదే సమయానికి బంగినపల్లి మామిడి పండ్లు మార్కెట్ కి 1,581 టన్నుల మామిడి పండ్లు విక్రయానికి వచ్చాయి. అయితే ఈ ఏడాది కేవలం 56 టన్నులు మాత్రమే మార్కెట్ కి చేరుకున్నాయి. సాధారణంగా ఎకరాకు 12 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే తోటలలో ఈ ఏడాది కేవలం రెండు మూడు రోజులకే పరిమితమవుతోంది. అయితే గత ఏడాది టన్ను మామిడి పళ్ళు ధరలు 15 నుంచి 35 వేల వరకు పలికింది. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా 70 నుంచి లక్ష రూపాయల ధర పలకడంతో మామిడిపండ్లు కొనడం ఈసారి సామాన్యులకు కష్టతరంగా మారుతోందని చెప్పవచ్చు.