...

Ram gopal varma: గద్దర్ పాటకు ఆర్జీవీ స్టెప్పులు.. మామూలుగా లేదుగా!

Ram gopal varma: కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడో ఏదో మాట్లాడుతూ.. భిన్నంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యకంగా కనిపిస్తుంటాడు. ఆయన తన సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. ఏదో ఒకటి చేసి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తాడు. తాజాగా తన కొత్త సినిమా కొండా ప్రమోషన్స్ కోసం ఏకంగా స్టేజీపై డ్యాన్స్ చేశాడు. అది కూడా మామూలు పాటకు కాదండోయ్.. గద్దర్ పాటకు. మెడలో ఎర్ర టవల్ వేస్కొని.. తలకు క్యాప్ పెట్టుకొని భిన్నంగా కనిపిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా పేరే కొండా. డైరెక్టర్ రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. జూన్ 23వ తేదీన సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్బంగా శనివారం వరంగల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఆర్జీవీ తొలిసారి స్టేజీపై డ్యాన్ చేశారు. గద్దరన్న పాటకు తనదైన స్టైల్ లో స్పెప్పులేసి అందరినీ మెప్పించాడు. మీరూ ఓసారి ఆ వీడియో చూసేయండి.

https://youtu.be/4kYFeaSIcdM