...

Ram Gopal Varma: సర్కార్ కన్నా తక్కువేం కాదు… దేవి నాగవల్లి, విశ్వక్ గొడవ పై వర్మ కామెంట్స్!

Ram Gopal Varma: గత రెండు రోజుల నుంచి హీరో విశ్వక్సేన్ ఫ్రాంక్ వీడియో గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఈ ప్రాంక్ వీడియో పై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోపై అడ్వకేట్ అరుణ్ కుమార్ మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రముఖ టీవీ యాంకర్ దేవి నాగవల్లి ఈ విషయంపై నిర్వహించి హీరో గురించి దారుణంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే హీరో యాంకర్ మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగింది.

ఇలా మాటల మధ్యలో హీరో యాంకర్ పై అసభ్య పదజాలం ఉపయోగించారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవి నాగవల్లి తనని తన స్టూడియో నుంచి బయటకు వెళ్లాలంటూ గట్టిగా అరిచారు.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియోపై స్పందించి వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ వీడియోపై కాంట్రవర్సి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ… ఒక పురుషుడు కన్నా ఒక మహిళ పవర్ ఫుల్ గా కనిపించడం నేను ఇంతవరకు చూడలేదు. ఈమె సర్కార్ కన్నా తక్కువేం కాదు అంటూ ఆర్జివి కామెంట్ చేస్తూ దేవి నాగవల్లికి ట్యాగ్ చేశారు. ఈ క్రమంలోనే వర్మ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా ఎంతోమంది దేవి నాగవల్లి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.