Hero Siddharth:సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడం కన్నా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో వివాదాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన సినిమాలలో నటించడం కన్నా వివాదాలలో ఎక్కువగా ఉంటారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సంచలనంగా మారిన సిద్ధార్థ్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.దేశ వ్యాప్తంగా ప్రస్తుతం వినబడుతున్న పాన్ ఇండియా సినిమాలు గురించి సిద్ధార్థ్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా అనేది అగౌరవకరమైనది, అది ఒక నాన్సెన్స్ అంటూ పాన్ ఇండియా సినిమాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక్కడ తెరకెక్కే సినిమాలన్ని భారతీయ సినిమాలు అయినప్పటికీ మరి ఆ సినిమాలకు పాన్ ఇండియా అని పేరు పెట్టడం అవసరమా.అలా అనుకుంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే మణిరత్నం దర్శకత్వంలో రోజా అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని అన్ని భాషలలో అందరూ చూసి ఆనందించారు అంటూ సిద్ధార్థ్ వెల్లడించారు.
ఒక సినిమా తెరకెక్కింది అంటే ఎంతో మంది టెక్నీషియన్లు పని చేయాలి. సినిమాని ఏ భాషలో చూసే అధికారం అయినా ప్రేక్షకులకు ఉంది. అలాంటప్పుడు పాన్ ఇండియా అని బిల్డప్ ఇవ్వడం అవసరమా. ఏ భాషలో సినిమా తెరకెక్కిస్తే ఆ భాషా చిత్రంగా చెప్పాలి కానీ ఆ సినిమాకు పాన్ ఇండియా అని పేరు పెట్టకూడదు. అది కేవలం ఇండియన్ సినిమా అని మాత్రమే పిలవాలి అంటూ సిద్ధార్థ్ పాన్ ఇండియా సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా సిద్ధార్థ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.