Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ పోలీసులు అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చారు.గత నెలలో వాహనదారులకు విధించిన ట్రాఫిక్ చలానాలను క్లియరెన్స్ చేయడం కోసం వాహనదారులకు అద్భుతమైన రాయితీ ప్రకటించిన ట్రాఫిక్ పోలీసుల బాటలోనే నగర పోలీసులు కూడా మరొక ఆఫర్ ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ ను నియంత్రణ చేయడం కోసం ఎన్నో ట్రాఫిక్ చలానాలు విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది వాహనదారులపై కేసులు ఉన్నాయి.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్(Disaster Management) కింద అధికారులు అంటే వేర్వేరు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసులో ఉన్న బాధితులకు నగర పోలీసులు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో సుమారు ఒక వాహనదారునిపై సుమారు వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించారు. అయితే ఈ జరిమాన పెండింగ్ ఉన్న వారికి నగర పోలీసులు ఒక అవకాశం కల్పించారు.
ఇలా ఎవరికైతే కేసులు ఉన్నాయో అలాంటి వారు కేవలం పది రూపాయలు చెల్లిస్తే చాలు వారిపై ఉన్న కేసును కొట్టి వేస్తామని వాహనదారులకు అవకాశం కల్పించారు.అయితే ఈ 10 రూపాయలు చెల్లించి తమ పై ఉన్న కేసులు కొట్టివేయడానికి కూడా నిర్ణీత గడువు కేటాయించారు. ఈ ఆఫర్ మే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మాత్రమే. ఈ క్రమంలోనే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాహనదారులకు నగర పోలీసులు సూచించారు.