...

Ram Gopal Varma: రాష్ట్రపతి అభ్యర్థి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ….?

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ప్రతి నిత్యం ఏదో ఒక విధమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇది రాజకీయ నాయకులు అటు సినిమా ఇండస్ట్రీ కి సంబంచిన ప్రతి విషయంలో రామ్ గోపాల్ వర్మ కలుగచేసుకొని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ సారి కూడ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు.

ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థి పై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చంశనీయంగా మారాయి. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై రామ్ గోపాల్ వర్మ మీద కేసు కూడ నమోదు చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని ఉదేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థి గా పోటీ చేసిన క్రమంలో రామ్ గోపాల్ ట్విట్టర్ వేదికగా..” ఇప్పుడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయితే మరి కౌరవులు ఎవరు..? పాండవులు ఎవరు ? అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ మీద బిజెపీనాయకులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై వారు స్పందిస్తూ..మహిళల్ని అవమానించేలా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని , అతని మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈయన దెయ్యం సినిమా షూటింగ్ పనులలో బిజిగా ఉన్నాడు.