Parrot Toddy : తాటి కల్లు.. ఈ పేరు వింటేనే కల్లు తాగే ప్రియులకు నోరు ఊరిపోతుంది. ఎంతో స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన కల్లు తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులోనూ ఈ తాటికల్లకు చిలుక ఎంగిలి తోడైతే.. ఆ రుచే వేరంట.. ఇప్పుడు ఆ చిలుక తాగిన కల్లును తాగేందుకు క్యూ కట్టేస్తున్నారు.. చాలా టేస్టీగా ఉంటుందని లొట్టేలేసుకుని తాగేస్తున్నారట.
సాధారణంగా చిలుక కొట్టిన పండు చాలా తియ్యగా ఉంటుందని అంటుంటారు. కానీ, చిలుక టేస్ట్ చేసిన కల్లును తాగితే ఇంకా మధురాతి మధురంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిలుక ఎంగిలి కల్లుకు ఫుల్ గిరాకీ పెరిగిపోవడంతో అందరికి దొరకడం లేదంట.. అందుకే ఈ చిలుక తాగిన కల్లు కోసం ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారట.. కల్లు ప్రియులు చాలామంది ముందుగానే ఫోన్ చేసి మరి బుకింగ్ చేసుకుంటున్నారట..
తాటివనంలో చిలుక ఎంగిలి చేసిన కల్లు అంటే ఆ టేస్టే వేరబ్బా అంటున్నారు కల్లు ప్రియులు.. ఇంతకీ ఈ చిలుక కల్లు దొరికిది ఎక్కడో తెలుసా? పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో అరుదుగా దొరుకుతుంది. ఇక్కడి తాటివనంలో రామచిలుకలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తాటివనంలో ముందుగా ఈ కల్లును చిలుకలు తాగిన తర్వాతే ఎవరైనా తాగాల్సిందే..
లేదంటే ఆ టెస్టు రాదని అంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో చిలుకలు తాటివనంలోకి వచ్చి కల్లును సేవిస్తుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ కల్లు కోసం కల్లు ప్రియులు ఎక్కడి నుంచో వస్తుంటారని, చాలామంది ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారని అంటున్నారు కల్లు దుకాణదారులు. ఈ రామ చిలుకలు ఎంగిలి కల్లును తాగేందుకు ఒక్క పెద్దపల్లి జిల్లా వాసులే కాకుండా.. పొరుగు జిల్లాల నుండి కూడ కల్లు ప్రియులు పెద్ద సంఖ్యలో వచ్చి సేవిస్తున్నారని చెబుతున్నారు కల్లు దుకాణాదారులు.
చిలుక తాగిన కల్లు డిమాండ్ బట్టి రేటు మారుతుందట.. మరో విషయం ఏమిటంటే.. ఈ అరుదైన కల్లు అన్ని సీజన్లలో దొరకదట.. కేవలం రెండు నెలల పాటే దొరుకుతుందట. అందుకే చిలుకలు ఎంగిలి చేసిన కల్లును తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
Read Also : చేపలు రోజూ తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..!