Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు బాధపడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్లో పరంధామయ్య పుట్టినరోజు వేడుకలు జరపడానికి నందు దంపతులు, అనసూయ హబీలు ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రేమ్ వాళ్ళందరూ కనిపించకపోయేసరికి నందు అభి ప్రేm వాళ్ళు కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు అని అనడంతో అప్పుడు లాస్య మనలాగే వాళ్లు కూడా ఏదైనా సీక్రెట్ గా ప్లాన్ చేశారేమో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు 12 అవుతోంది అని ఏదైతే మనం వెళ్దాం పదండి అని వాళ్ళు నలుగురు కలిసి వెళ్తారు.
అప్పుడు పనుందామయ్యకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి దుప్పటి తీయడంతో అక్కడ తల దిండులు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు నాన్న ఎక్కడికి వెళ్ళాడు అమ్మ అని నందు,అనసూయను అడగడంతో వెంటనే అనసూయ ఇంకా ఎక్కడికి వెళ్లాడు మీ నాన్న ఆ తులసి దగ్గరికి వెళ్లి ఉంటాడు సెలబ్రేట్ చేసుకోవడానికి అని అంటుంది. అప్పుడు అనసూయ అనవసరంగా తులసిని నానా మాటలు అంటూ కావాలని ఆ తులసి కావాలని ఇలా చేస్తుంది మనకు ఏ సంతోషాన్ని దక్కకుండా చేస్తోంది. తులసిపై లేనిపోని వింతలు వేస్తుంది అనసూయ.
ఇప్పుడు ఆ మాటలు అన్ని విన్న అభి కోపంతో తులసిని నిందించడానికి అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరొకవైపు ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు కోసం అన్ని సిద్ధంగా చేసి ఉంటారు. సామ్రాట్ తులసిని కళ్ళు మూసుకుని అక్కడికి పిలుచుకొని వచ్చి డెకరేషన్ మొత్తం చూపించడంతో తులసి ఆశ్చర్య పోతుంది. అప్పుడు తులసి మామయ్య ఇక్కడే ఉంటే బాగుండు అని అనడంతో ఇంతలో అక్కడికి పరంధామయ్య రావడంతో సంతోష అక్కడికి వెళ్లి పరంధామయ్య ఆశీర్వాదాలు తీసుకుంటుంది.
శృతి దంపతులు అంకిత, దివ్యలు కూడా అక్కడికి రావడంతో తులసి సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత పరంధామయ్య కొద్దిసేపు తులసి గురించి ఎమోషనల్ గా మాట్లాడుతాడు. అప్పుడు అందరూ కలిసి పనుందామయ్య పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకుంటారు. మరొకవైపు నందు లాస్య అనసూయలు కూర్చుని ఇంట్లో నాకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు పిల్లలతో సహా ఏ ఒక్కరు నన్ను పట్టించుకోవడం లేదు అని నందు బాధపడుతూ ఉంటాడు.
ఇప్పుడు లాస్య నందుని మరింత రెచ్చగొడుతూ అందరూ ఆ తులసి మాయలో పడిపోయారు. అప్పుడు అనసూయ కూడా తులసి మీద కోప్పడుతుంది. అప్పుడు మరొకవైపు తులసి సెలబ్రేషన్స్ జరుపుకున్న తర్వాత మామయ్య మీకోసం అత్తయ్య టెన్షన్ పడుతూ ఉంటుంది వెళ్ళండి అనడంతో అప్పుడే వెళ్లిపోవాలా తులసి అని అంటారు పరంధామయ్య. ఇప్పుడు అంకిత మాకు కూడా వెళ్లాలని ఉంది కాకపోతే కొద్దిసేపు మీతో కబుర్లు చెప్పుతాం ఆంటీ అని అనగా ఇక్కడే ఉంటే గొడవలు జరుగుతాయి అని ప్రేమ్ అందరిని తీసుకెళ్తాడు. అంకిత మాత్రం అక్కడే ఉండిపోతుంది.
ఇంతలోనే అభి అక్కడికి వచ్చి ఇక్కడికి ఇంకెవరు రారు శుభకార్యానికైనా అశుభకార్యానికైనా ఎవరు ఇక్కడికి రారు అని అనడంతో అభి ఏం మాట్లాడుతున్నావ్ ఈ రోజు తాతయ్య పుట్టినరోజు మనందరికీ పండుగ ఇంతకుముందే వచ్చి ఉంటే నువ్వు కూడా మాతో పాటు సెలబ్రేట్ చేసుకునే వాడివి అని అనడంతో వెంటనే అభి మామ్ నేను మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి రాలేదు నువ్వు కొత్త ఇంట్లోకి వచ్చావని కంగ్రాట్స్ చెప్పడానికి రాలేదు అని అంటాడు అభి.