Peacock Feathers : నెమలి ఈక ను ఇంట్లో పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం నెమలి ఈక ఇంట్లో ధన లాభాన్ని అలాగే సానుకూల శక్తిని పెంచుతుంది. శ్రీ కృష్ణుని కిరీటం పై ఉన్న నెమలి ఈక ఇంట్లో అనేక సమస్యలను దూరం చేస్తుంది. సాధారణంగా ఇంట్లో అందరూ నెమలి ఈక ను డెకరేషన్ కోసం వాడుతుంటారు. కానీ వాస్తవానికి దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఎవరికి తెలియదు. ఇంట్లో నెమలి ఈక ను ఉంచడమే కాకుండా ఏ దిశలో పెట్టాము అన్నది కూడా ముఖ్యమే అంటున్నారు వాస్తు శాస్త్రజ్ఞులు.
ఇంట్లో నెమలి ఈకలు పెడితే సంపదకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి అలాగే విద్యా దేవి అయినటువంటి సరస్వతి ఇద్దరూ ఉంటారు. నెమలి ఈక కనుక వేణువు తో కలిపి ఉంచినట్లయితే ఇంట్లోన వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ నెమలి ఈకలను బెడ్రూంలో ఉంచడం వల్ల వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
మీకు ఎవరైనా శత్రువులు గా ఉన్నప్పుడు ఆ శత్రుత్వాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే నెమలి ఈకలు తీసుకొని సింధూరం తో వాళ్ళ పేర్లు రాసి మంగళ మరియు శనివారాల్లో పూజ గదిలో ఉంచి మరుసటి రోజు వాటిని నీటిలో ఉంచండి ఇలా చేయడం వల్ల శత్రుత్వం కొంతమేరకు తగ్గుతుంది. అలాగే గ్రహ అశుభ ప్రభావాలను తొలగించుకోవాలి అనుకుంటే ఆ గ్రహం యొక్క మంత్రాన్ని 21 సార్లు జపించి వాటిపై నీటిని చల్లి అందరికీ కనపడేలా ఒక ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల గ్రహ అశుభ ఫలితాలు తొలగిపోతాయి.
అంతేకాకుండా పిల్లల పై పడే చెడు దృష్టిని పోగొట్టాలంటే నెమలి ఈకను వెండి రక్ష లో ధరించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈక ను దక్షిణ దిశలో మీరు డబ్బు నిల్వ చేసే ప్రదేశం లో ఉంచినట్లయితే డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. ఇంట్లోనే తూర్పు మరియు వాయువ్య డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. ఇంట్లోనే తూర్పు మరియు వాయువ్య గోడలపై నెమలి ఈకలు ఉంచినట్లయితే ఇంట్లో వాళ్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే రాహు దోషాలను తొలగిపోవాలంటే ఇంట్లో తూర్పు మరియు వాయువ్య దిశలో ఈ నెమలి ఈకలను ఉంచడం మంచిది..
Read Also : Vasthu tips : ఇంటి వాస్తు ఒక్కటే కాదండోయ్.. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమేనట!