Vasthu tips: ఇంటి వాస్తు ఒక్కటే కాదండోయ్.. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమేనట!

Vasthu tips: హిందూ సంప్రదాయాల ప్రకారం వాస్తు చూపించే వరకు ఇంటి నిర్మాణాలు చూపెట్టారు. ఏ దిశలో ఏం గది ఉండాలి, ఎక్కడ ఎలాంటి వస్తువులు పెట్టాలి వంటి అన్ని విషయాలు చర్చించుకున్న తర్వాతనే గృహ నిర్మాణాలు చేపడతారు. అయితే వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకొని అందులో ఉంటున్నా సమస్యలు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందేనని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో కేవలం ఇళ్లు, ఇంట్లోని వస్తువుల వాస్తే కాకుండా… ఇంటి పరసరాల వాస్తును కూడా గమనించాలని చెబుతున్నారు. పరిసరాల వాస్తు సరిగ్గా లేకపోతే పది సంవత్సరాల్లో జరిగే నష్టం అంతా ఒక్క ఏడాదిలోనే జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఇళ్లు కట్టుకునేందుకు స్థలం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంటిపై లేదా తీసుకున్న స్థలంపై గుడి గోపురం నీడ అస్సలే పడకూడదు. అలాగే ఇంటి తలుపులు గుడి తలుపుల కంటే ఎక్కువ ఎత్తుగా ఉండకూడదట. అలాగే గుడిలో నుంచి వెలువడే గంట శబ్దం, హారతి, ధూపదీపాలు బయటకు నెగటివ్ శక్తిని పంపిస్తాయని చెబుతుంటారు. కాబట్టి ఆలయాలకు దగ్గరగా ఇళ్లను నిర్మించుకోకూడదు. గుడి మాత్రమే కాదండోయ్ చర్చి, మసీదుల నీడ కూడా ఇళ్లపై పడకూడదు. వాస్తు దోషాలు లేకుండా ఉన్న ఇళ్లను, స్థలాలను మాత్రమే కొనాలని చెబుతున్నారు. పరిసరాల వాస్తు, ఇంటి వాస్తు బాగుంటే పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు.