Vaasthu tips : ఇంట్లో చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇక అంతే!

Vaasthu tips : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే అనే ఆర్థిక నష్టాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పురాణ గ్రాంథాల ప్రకారం చీపురును తొక్కితే లక్ష్మీ దేవత అంసతృప్తి చెందుతుందని అంటుంటారు. అయితే నిజానికి చీపురు కట్ట శుభానికి చిహ్నం అంట. అందుకే ఇంటిని చీపురతో శుభ్రం చేస్తారట. అలా చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. కానీ జ్యోతిష్యం ప్రకారం చీపురు పారేయడానికి కొన్ని నిమయాలు ఉన్నాయి. అవి పాటించడంలో లోపం జరిగితే ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి. చీపురుపై అడుగు పెట్టడం వల్ల అత్యంత పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందట. కాబట్టి మీరు చీపురను తొక్కకుండా చూస్కోండి.

Advertisement
Amazing Vasthu tips in broom maintenance
Amazing Vasthu tips in broom maintenance
  • గురువారం రోజు ఇంట్లోనుంచి పాత చీపురును తీసేయొద్దు.
  • ఏకాదశి నాడు చీపురు పారేయడం అశుభం.
  • చీపురును ఎక్కడ పడితే అక్కడ కాకుండా చెట్ల కింద లేదా పారుతున్న నదిలో మాత్రమే పాడేయాలి.
  • పాత చీపురు లేదా విరిగిన చీపురుతో ఇంటిని అస్సలే ఊడ్చకూడదు.
  • శనివారం చీపురు పాడేయ్యడానికి అనుకూలమైన రోజు. మీరు అమావాస్య రాత్రి కూడా చీపురును పాడేయవచ్చు. అయితే ఎవరికీ చెప్పకుండా పాడేయాలి.
  • ఇలా చేస్తే అంటే సరైన నియమాలు పాటిస్తే ఆర్థికంగా మీరు చాలా బాగవుతారని పురాణాలు కూడా చెబుతున్నాయి.

Advertisement