Vastu Tips : మన హిందూ మతంలో మొక్కలకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ మతంలో దేవతలను పూజించడమే కాకుండా కొన్ని రకాల మొక్కలను కూడా పరమ పవిత్రంగా పూజిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం శివుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో నిష్టగా శివుడిని ఆరాధిస్తే కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో వెల్లడించారు. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఐదు రకాల చెట్లను పూజించడం వల్ల సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణమాసంలో పూజించాల్సిన ఐదు రకాల చెట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన హిందూ పురాణాలలో రావిచెట్టు ప్రాముఖ్యత చాలా గొప్పగా వివరించారు. రావి చెట్టుని పూజించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మన హిందూ పురాణాలలో వెల్లడించారు. హిందూ పురాణాల ప్రకారం రావి చెట్టు మూలంలో విష్ణువు, కాండంలో కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీ హరి మరియు పండ్లలో సకల దేవతలు ఉంటారని వెల్లడించారు. ఆదివారం మినహాయించి మిగిలిన రోజులలో రావి చెట్టుకు నీటిని అందించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా రావి చెట్టు మూలాన్ని తాకటం వల్ల వ్యాధులు దూరమై సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
మన హిందూ పురాణాలలో రావిచెట్టు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన చెట్లలో మర్రిచెట్టు కూడా ఒకటి. మర్రిచెట్టు బ్రహ్మ, విష్ణువు, శివునికి నివాసం అని హిందూ పురాణాలలో తెలియజేశారు. మన హిందూ మతంలో మహిళలు ఎంతో నిష్టగా ఆచరించే వట సావిత్రి వ్రతాన్ని మర్రిచెట్టుకు అంకితం చేశారు. మర్రి చెట్టుని దర్శించి దానిని తాకటం వల్ల మహిళలు వారి భర్తల దీర్ఘాయుష్షును పొందుతారు.
పరమశివునికి ఎంతో ఇష్టమైన వృక్షం బిల్వ వృక్షం. బిల్వపత్రాలతో పరమశివునికి పూజించడం ద్వారా ఆయన అనుగ్రహం పొందవచ్చు. శివునికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో బిల్వ వృక్షానికి కూడా పూజలు చేస్తారు. బిల్వ వృక్షం మూలంలో లక్ష్మి దేవత కొలువై ఉంటుంది. అందువల్ల శ్రావణమాసంలో బిల్వ వృక్షం కి పూజలు చేయడం ద్వారా ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
శ్రావణమాసంలో మర్రి చెట్టుకు పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని శివ, విష్ణు, లక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మి అనుగ్రహం పొందుతారు.
ఇక శ్రావణమాసంలో పూజించాల్సిన మరొక చెట్టు వేప చెట్టు. శ్రావణమాసంలో వేప చెట్టుని పూజించటం వల్ల జాతక దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా ప్రతి శుక్ల పక్షంలోని అష్టమి నాడు ఉదయం 8 గంటలకు దుర్గ మాత ఈ చెట్టులో నివసిస్తుంది. ఆ సమయంలో వేప చెట్టుకు పూజ చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
Read Also : Vastu Tips : ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేదా? అయితే ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది?
Tufan9 Telugu News And Updates Breaking News All over World