Karthika Deepam july 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ,నిరుపమ్ గురించి ఆలోచిస్తూటెన్షన్ పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న, సత్య ఇద్దరు నిరుపమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు స్వప్న, తండ్రిగా మీకు బాధ్యత లేదా ఇంట్లో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ కాదా అంటూ సత్య పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది. ఇలా అయినా నా కొడుకుని మళ్లీ నా కళ్ళ ముందుకు తీసుకుని రండి అని సత్యని అడుగుతుంది. అప్పుడు సరే ఎలా అయినా నిరుపమ్ ని తీసుకుని వస్తా అని సత్యా అంటాడు.


మరొకవైపు ఆనందరావు, సౌందర్యలు జరిగిన విషయాల గురించి తలుచుకొని ఏదో ఒకటి చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు హిమ,నిరుపమ్ బావ మా ఇంటికి ఎందుకు వచ్చాడు. అసలేం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే నిరుపమ్, హిమ కోసం టీ షర్టు జీన్స్ ప్యాంట్ తీసుకుని వచ్చి ఒకసారి ఇవి వేసుకుని రా హిమ నిన్ను ఇందులో చూడాలని ఉంది అంటూ హిమని బలవంత పెడుతూ ఉంటాడు.
అప్పుడు హిమ ఇష్టం లేదు అన్నా కూడా నిరుపమ్ వినిపించుకోకుండా ఆ డ్రెస్ ని వేసుకుని రమ్మని బలవంత పెట్టడంతో హిమ ఆ డ్రెస్ ని వేసుకుని వస్తుంది. అది చూసిన నిరుపమ్ సూపర్ గా ఉన్నావు హిమ ఇంత అందగత్తె నా భార్య అవుతున్నందుకు నాకే జలసిగా ఉంది అంటూ అందాన్ని పొగుడుతూ ఐ లవ్ యు హిమ అని చెబుతాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన సౌర్య వారి మాటలు వింటుంది. లోపల బాధపడుతూ ఉండగా అది చూసిన హిమ,సౌర్య ఏమనుకుంటుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత కోపంతో ఇంట్లోకి వెళ్లిన సౌర్య అసలు నీ ఇంట్లోకి ఎందుకు వచ్చాను ఏం జరుగుతోంది అని జరిగిన విషయాల గురించి తలుచుకుంటూ బ్యాగ్ లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సౌందర్య ఆనంద్ రావ్ లు లగేజ్ తీసుకుని అక్కడికి వస్తారు.

ఏంటి తాతయ్య ఇది అని అడగగా మేము కూడా నీతో పాటే వస్తాము నువ్వు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాము అంటూ ఎమోషనల్ గా మాట్లాడి సౌర్య ని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపేస్తారు సౌందర్య ఆనందరావు. మరొకవైపు శోభ,నిరుపమ్ గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వస్తుంది. ఇంతలో స్వప్న అక్కడికి రావడంతో మీ తమ్ముడు భార్య మోనిత తానే మెడలో తాళిబొట్టు కట్టుకుంది కదా ఆంటీ అలా నేను చేస్తాను అని అనగా నీకు అలాంటి కర్మ ఏంటి శోభ రెండు రోజులు ఆగు నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటుంది స్వప్న.
Karthika Deepam : అపార్ధం చేసుకున్న స్వప్నకి శౌర్య క్లారిటీ ఇచ్చిందా…

మరొకవైపు హిమ,ఆలోచిస్తూ ఒక ప్లాన్ వేస్తుంది. వెంటనే సౌందర్య కు ఫోన్ చేసి తాతయ్యని వెంటనే పిలుచుకొని హాస్పిటల్ కు వచ్చే అని చెబుతుంది. ఆ తర్వాత సౌర్య ఆటో కి వెళ్లడానికి చూడగా అప్పుడు ఆటో సరిగా పనిచేయకపోవడంతో ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నిరుపమ్ హాస్పిటల్ కి వెళ్తున్నాను తాతయ్య నానమ్మయ అని గట్టిగా అరుస్తూ ఉండగా అప్పుడు సౌర్య ఇంట్లో ఎవరూ లేరు అని చెబుతుంది. అప్పుడు సరే అని నిరుపమ్ హాస్పిటల్ కి బయలుదేరగా కారు ఆగిపోవడంతో నిరుపమ్ కూడా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో సౌర్య,నిరుపమ్ కోసం కాఫీ తీసుకుని వస్తుంది. అప్పుడు నిరూపం కాఫీ నువ్వు కూడా తాగు అంటూ సౌర్యని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన స్వప్న అది చూసి కోపంతో నిరుపమ్ అంటూ గట్టిగా అరుస్తుంది. దీన్ని కూడా తగలబెట్టాలని చూస్తున్నారా అనగా సౌర్య సీరియస్ అవుతుంది.
Read Also : Karthika Deepam july 26 Today Episode : హిమకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నిరుపమ్.. సంతోషంలో ప్రేమ్..?