Devatha july 26 today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య మాధవ అంతు చూస్తాను అంటూ కోపంగా బయలుదేరుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ కారులో వెళుతూ ఆదిత్య కు ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్పి పిలుస్తాడు. మరొకవైపు ఆదిత్య కోపంతో మాధవ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంట్లో రాధ ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే సరికి ఏం జరగకుండా చూడు దేవుడా అని దేవుడు నిన్ను ప్రార్థిస్తూ ఉంటుంది రాధ.

Devatha july 26 today Episode
మరొకవైపు మాధవ చెప్పిన ప్లేస్ కి ఆదిత్య వస్తాడు. అప్పుడు మాధవ పిలవగానే వచ్చినందుకు థాంక్స్ ఆఫీసర్ సారు అని అనగా ఏం కావాలో చెప్పు నాకు పని ఉంది అని అంటాడు ఆదిత్య. అప్పుడు మాధవ ఇన్ని రోజులు పాటు మా ఇంటి చుట్టూ రాధ కోసం పిల్లల కోసం తిరిగింది చాలు ఇకపై మానేయండి అని అంటాడు. రాధ తో మాట్లాడటం, దేవిని మీ ఇంటికి తీసుకెళ్లడం లాంటివి మానేయండి అసలు మా ఇంటికి రావద్దు అని అంటాడు.
దేవత సీరియల్ జూలై 26 ఎపిసోడ్ : ఆదిత్య.. భారీ కుట్ర పన్నిన మాధవ….

Devatha july 26 today Episode
devatha july 26 today Episodeఎందుకంటే రాధ నా భార్య దేవి నా కూతురు అనడంతో వెంటనే ఆదిత్య కోపంతో రగిలిపోతూ మాధవ చెంప చెల్లుమనిపిస్తాడు. అప్పుడు ఆదిత్య కోపంతో మాట్లాడుతూ మౌనంగా ఉన్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడావు అంటే మర్యాదగా ఉండదు. నాలో ఆఫీసర్స్ అని మాత్రమే చూసావు ఆదిత్యను చూడలేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉండదు. నా భార్యని నా కూతురిని తెచ్చుకోలేని చేతగాని వాడు కాదు ఈ ఆదిత్య నీ బిడ్డ నీ తల్లిదండ్రులు ఏమవుతారో అన్న మంచితనంతో రాధా అక్కడే ఉంటూ నా నోరుని కట్టేసింది అంటూ కోపంగా మాధవకు బుద్ధి చెబుతాడు. అప్పుడు మాధవ ఇకపై నేనేంటో చూపిస్తాను అని అనగా ఏం చేయలేవు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత మాధవ వెళ్లి తన కారులో ఈ వీడియోని అంత రికార్డ్ చేసిన మొబైల్ ని తీసుకొని నవ్వుతూ ఉంటాడు.

devatha july 26 today Episode
మరొకవైపు సత్య అమెరికాకు వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకోగా దేవుడమ్మ అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఇంతలోనే ఆదిత్య అక్కడికి వచ్చి మనం ఇప్పుడు వెళ్లడం లేదు ఇంకొక వారం తర్వాత వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాధవ రావడంతో లోపలికి వెళ్తూ ఉండగా రాధను పిలిచి నువ్వు నన్ను కొట్టడానికి చూసావు నీ మొగుడు ఏకంగా నన్ను కొట్టాడు అని అనగా నువ్వు ఏదో వాగి ఉంటావు అందుకే మా ఆయన కొట్టాడు అని అంటుంది రాద. ఆ తర్వాత కొట్టిన వీడియోని చూపించడంతో రాధ షాక్ అవుతుంది. ఇప్పుడు చెబుతున్నాను గుర్తుపెట్టుకో రాధ ఆ ఆదిత్య కు చేతనైతే ఇక్కడి నుంచి నిన్ను దేవిని తీసుకెళ్లమని చెప్పి రాధ తో సవాలు విసురుతాడు ఆదిత్య. అప్పుడు రాధ ఆ వీడియో ఎందుకు తీసావ్ అని అనగా వెంటనే మాధవ నువ్వు ఆదిత్యనే దేవికి అసలు తండ్రి అని నిజం చెప్పినప్పుడు ఈ వీడియోని బయటపెడతాను అనడంతో రాధ ఒకసారిగా షాక్ అవుతుంది.