Telugu NewsEntertainmentbig boss 6 telugu: తినడానికి, చిల్ అవడానికి అయితే వెళ్లిపోండంటూ నాగ్ చీవాట్లు, ఎవరికంటే?

big boss 6 telugu: తినడానికి, చిల్ అవడానికి అయితే వెళ్లిపోండంటూ నాగ్ చీవాట్లు, ఎవరికంటే?

big boss 6 telugu: బిగ్ బాస్ రెండో వారం దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికీ ఆట మొదలు పెట్టని వారిపై నాగార్జున చాలా సీరియస్ గా ఫైర్ అయ్యారు. హౌస్ లో ఒక్కొక్కరి ప్రవర్తన దగ్గర నుంచి, గేమ్ అడే తీరు వరకు ప్రతీ ఒక్కటి గుర్తు చేస్తూ… హౌస్ మేట్స్ పై సీరియస్ అయ్యారు. ఇంట్లో ఉన్న సభ్యులందరిలో వరస్ట్ ఉన్న కంటెస్టెంట్స్ ను పక్కన పెట్టాడు. అందులో బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా, రోహిత్, అభినయ శ్రీ, కీర్తి భట్, శ్రీహాన్ మొత్తం తొమ్మిది మందిని పక్కన పెట్టాడు. ముందుగా కీర్తిని మాట్లాడిస్తూ.. లైఫ్ అనేది నిన్ను సరిగ్గా చూడలేదు.. కానీ ఇప్పుడు నీకు జీవితం మరో ఛాన్స్ ఇచ్చింది. ఇంపాజిబుల్ ఛాన్స్ వచ్చింది. ఈ వారం నీ ఆట లేదు అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Advertisement

అలాగే పక్కన పెట్టిన మిగతా కంటెస్టెంట్లపై కూడా ఫైర్ అయ్యాడు. ఇక శ్రీహాన్ అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకోవడం కాదు… ఆట మీద దృష్టి పెట్టు సేప్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ గాలి తీసేశాడు. అలాగే మెరీనాను హగ్గులు, కిస్సులు బాగానే అడుగుతున్నావ్ కానీ ఆట ఆడకపోతే అడగవా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అభినయ, సుదీప, షానీ,శ్రీసత్య, బాలాదిత్య, వాసంతిలను తిని పడుకోవడానికి, చిల్ అవ్వడానికి వస్తే మాత్రం… మాకొద్దు అంటూ ఫైర్ అయ్యాడు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు