Krishna Vrinda Vihari Movie Review : హీరో నాగ శౌర్య సరైన హిట్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. చేస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ టాక్ అందుకోలేకపోతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన నాగశౌర్య మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతోనైనా హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు. హోం బ్యానర్‌లో నాగశౌర్య తల్లి ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని నిర్మించారు. ఇంతకీ ఈ మూవీతో నాగశౌర్య హిట్ కొడుతాడో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

స్టోరీ ఇదే (Story) :
నాగశౌర్య (కృష్ణ) ఒక సాధారణ బ్రాహ్మణ కుర్రాడిగా నటించాడు. కృష్ణ తన ఆఫీస్‌లో పనిచేసే వ్రింద(షిర్లీ సెటియా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెను ఎలాగైనా ఇష్టపడేలా చేసేందుకు తిప్పలు పడతాడు. చివరికి ఆమెను ప్రేమించేలా చేసుకుంటాడు. ఈ మూవీలో వారిద్దరికి పెళ్లి కూడా అవుతుంది. పెళ్లి అనంతరం కృష్ణ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు.. ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.. వేర్వేరు సాంప్రదాయ కుటుంబాల మధ్య వీరి వైవాహిక జీవితం సాగింది అనేది స్టోరీగా చెప్పవచ్చు.

నటీనటులు (Cast) :
నాగశౌర్య అద్భుతంగా తనదైన నటనతో నటించాడు. విభిన్నమైన లుక్‌తో ఆకట్టుకున్నాడు. నాగశౌర్య నటన అద్భుతంగా ఉంది. కానీ, హీరోయిన్ షిర్లీ సెటియా నటన ఆకట్టుకునేలా లేదు. లుక్ పరంగా పర్వాలేదని అనిపించింది. ఇరువురి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. మిగతా పాత్రల్లో తమ పాత్ర మేరకు నటించారు.
Krishna Vrinda Vihari Movie Review : కృష్ణ వ్రింద విహారి మూవీ ఎలా ఉందంటే?
టెక్నికల్‌గా చూస్తే.. స్టోరీని ఇంకా బలంగా ఉండాల్సింది. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. సీన్లలో ఎక్కడ కూడా లాజిక్ కనిపించలేదు. ఎమోషనల్ సీన్లలోనూ పెద్దగా ప్రేక్షకులను అలరించేలా లేవు. మ్యూజిక్ యావరేజ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది.

సినిమాటోగ్రపీ యావరేజ్‌గానే ఉంది. కొన్నిసీన్లు తేలిపోయినట్టుగా అనిపించింది. ఎడిటింగ్ లోపాలు బాగా కనిపించాయి. నిర్మాణాత్మక విలువలు కూడా అంతమాత్రంగానే ఉన్నాయి. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. సెకండ్ హాఫ్ కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయి.
కామెడీ ట్రాక్‌లో నాగ శౌర్య తనదైన నటనతో అలరించాడు. స్టోరీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బలమైన పాత్రలు లేకపోవడం మూవీకి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. మొత్తం మీద నాగ శౌర్య మూవీ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఈ మూవీతోనైనా సక్సెస్ అందుకోవాల్సి ఉండగా.. నాగ శౌర్య మెప్పించలేక పోయాడు. నాగశౌర్య మళ్లీ హిట్ కొట్టలేకపోయాడనే చెప్పాలి.
[ Tufan9 Telugu News ]
కృష్ణ వ్రింద విహారి
మూవీ రివ్యూ & రేటింగ్ : 2.4/5.0
Read Also : Brahmastra Movie Review : బ్రహ్మాస్త్ర రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?