Karthika Deepam serial Oct 22 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, దీప దగ్గరికి వచ్చి నువ్వు ఎలా కార్తీక్ ని దక్కించుకుంటావు అని ఛాలెంజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప విన్నారు కదా డాక్టర్ బాబు ఆ మోనితనే తన నోటి నుంచి నేను మీ భార్యని అని ఒప్పుకుంది అనడంతో వెంటనే టెన్షన్ పడిన మోనిత కార్తీక్ దీని మాటలు నమ్మొద్దు. అది నన్ను రెచ్చగొట్టే సరికి అలా మాట్లాడాను నేను నీ భార్యని అని మోనిత మాట్లాడుతూ ఉండగా దీప నవ్వుతూ ఉంటుంది. అప్పుడు మోనిత ఎందుకు నవ్వుతున్నావు అని అనగా లోపల డాక్టర్ బాబు లేరు అని నవ్వుతుంది.
దాంతో మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వస్తువు సౌర్య ఎక్కడ ఉన్నావు నీ కోసం ఎదురుచూస్తున్నాను అని ఆలోచిస్తూ ఇంటికి వస్తూ ఉండగా ఇంట్లో బాబు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మోనితను చూసి ఏం మోనిత బాబు ఏడ్చేది కూడా నీకు వినపడలేదా అని అరిచి వెళ్లి బాబుని ఎత్తుకుంటాడు.
అప్పుడు మోనిత అక్కడికి వెళ్లడంతో మోనిత పై సీరియస్ అవుతాడు కార్తీక్. ఆ తర్వాత దుర్గ గారు అని బయటికి పీల్చుకుంటూ వెళ్ళగా దుర్గ ఇక్కడ ఎందుకు ఉంటాడు కార్తీక్ అనడంతో అందుకే నువ్వు ఏదో పరధ్యానంలో ఉన్నావు అని అంటాడు కార్తీక్. ఇప్పుడు అది కాదు కార్తీక్ నువ్వు ప్రతిసారి ఎప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురుచూసే దాన్ని ఇప్పుడు ఇంటికి వస్తే ఎలా అనుమానిస్తావో అని భయంగా ఉంది అని అంటుంది.
Karthika Deepam అక్టోబర్ 22 ఎపిసోడ్ : శౌర్యని వెతికే ప్రయత్నంలో దీప,కార్తీక్…
దాంతో కార్తీక్ మౌనితకు బాబుని అప్పగించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తరువాత రోజు ఉదయం మోనిత ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి శివ వస్తాడు. అప్పుడు మోనిత ఆ వంటలక్క ఇంటిదగ్గర నీకేం పని అనడంతో శివ అబద్ధాలు చెబుతాడు. చెప్తావా లేదా అని మోనిత వార్నింగ్ ఇవ్వడంతో కార్తీక్ సార్ నన్ను అక్కడ పడుకోమని చెప్పారు మేడం అని అంటుంది. దాంతో మోనిత షాక్ అవుతుంది.
ఆ తర్వాత మోనిత అక్కడ నుంచి వెళ్తూ ఉండగా దుర్గా వచ్చి మనితా బంగారం కాఫీ ఇస్తావా అని అనడంతో కాఫీ కాదురా అందులో పెనాయిల్ కలిపి ఇస్తాను అంటూ కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కార్తీక్ బాబుని ఉయ్యాలలో పడుకోబెడుతూ దీప గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మోనిత వస్తుంది. కార్తీక్ కాఫీ ఇవ్వాలా అని బాగా అడిగావు మోనిత తీసుకురా అని అంటూ దుర్గ గారికి కూడా ఇచ్చావా అని అడుగుతాడు కార్తీక్.
నేనెందుకు ఇస్తాను కార్తీక్ అని అనడంతో మన ఇంటికి గెస్ట్ కదా అందుకే అని అంటారు కార్తీక్. నేను ఇవ్వలేదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దుర్గా వచ్చి థాంక్స్ మోనిత కాఫీ బాగా పెట్టావు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇంతవరకు నీ మీద జాలి వేస్తుంది అన్నాను కానీ ఇప్పుడు నా మీద నాకే జాలి వేస్తుంది మోనిత అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. అప్పుడు ఎందుకు దుర్గ నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ మోనిత దొంగ ఏడుపులు ఏడ్చగా దుర్గ మాత్రం నమ్మడు.
మరొకవైపు దీప బట్టలు ఆరేస్తూ ఇంద్రుడు ని తలుచుకుంటూ ఆరోజు అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడింది బస్సులో కనిపించింది ఒకవేళ ఆ అమ్మాయి మన శౌర్య ఏమో అని అక్కడికి శౌర్యను వెతకడానికి బయలుదేరుతుంది దీప. దీప శౌర్య కోసం వెతుకుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. మీరేం చేస్తున్నారు డాక్టర్ బాబు అని అడగగా ఇక్కడికి ఇలా వచ్చాను దీప అని అంటాడు. పాప్ కార్న్ తీసుకున్నారు ఎవరికి అని అనగా నాకు గతం గుర్తులేదు కదా దీప గతంలో నాకే ఒకవేళ ఇది ఇష్టమేమో లేకపోతే నాకు కావాల్సిన వారికి ఇది ఇష్టమేమో అని అంటాడు కార్తీక్. అప్పుడు అటుగా సౌర్య కనిపించడంతో డాక్టర్ బాబు శౌర్య వెళుతుంది అంటూ ఆర్య ఆటో వెనకాలే ఫాలో అవుతాడు దీప కార్తీక్.
Tufan9 Telugu News And Updates Breaking News All over World