Karthika Deepam serial Oct 21 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్ మాటలకు మోనిత షాక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో పోలీసులు వెళ్లిపోతూ ఉండగా సర్ ఈవిడ పేరు వంటలక్క ఈ వీడికి ప్రాణాపాయం ఉంది సెక్యూరిటీ ఇవ్వండి అని కార్తీక్ అడగగా, ఇప్పుడు పోలీసులు ఎవరివల్ల ప్రాణాపాయం ఉందంటున్నారో వారి పేరు చెప్పండి అరెస్టు చేస్తాం అని అనగా అమ్మవారితో కార్తీక్,మోనిత వైపు చూస్తాడు. దాంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు మోనిత వాళ్ళు ఎవరో పోలీసులకు చెప్పు వాళ్ళు చూసుకుంటారు అని అనగా మోనిత మౌనంగా ఉంటుంది. ఆరోజు చీకటిలో దాడి చేశారు కదా గుర్తుకు ఉండదు లే అని అనగా పోలీసులు మీరేం భయపడకండి సార్ మా దగ్గర రౌడీ షీటర్ల లిఫ్ట్ ఉంది గెస్ట్ గా వాళ్లని నాలుగు తంతే వారిని నిజం బయటపెడతారు అనడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు దీప, కార్తిక్ థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ ఏమీ తెలియనట్టుగా మోనిత మీద సీరియస్ అవుతాడు. ఒకవేళ నేను పోలీసులు అరెస్టు చేస్తే నా గతి ఏమీ అంటూ ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతాడు కార్తీక్. ఆ తరువాత మౌనిత హాల్లో కూర్చుని జరిగిన విషయం గురించి తలుచుకొని కార్తీక్ ప్రవర్తన గురించి అనుమాన పడుతూ ఉండగా ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి కార్తీక్ ఫోటోకి పూజ చేస్తూ ఉంటాడు.
Karthika Deepam అక్టోబర్ 21 ఎపిసోడ్ : మోనిత టెన్షన్..శౌర్యని సౌర్య కోసం ఎమోషనల్ కార్తీక్ ..
అప్పుడు అక్కడికి వెళ్లిన మోనిత నిన్ను పోలీసులకు అప్పగించకుండా బాంబు వేసి పైకి పంపించి ఉంటే బాగుండేది అనడంతో నువ్వు నన్ను ఏమీ చేయలేవు బంగారం అని అంటాడు దుర్గ. అలా వారిద్దరు కాసేపు వాదించుకుంటూ ఉంటారు. మరొకవైపు దీప, హేమచంద్రతో జరిగిన విషయం చెబుతూ ఉంటుంది.
ఆ తర్వాత మౌనిత దగ్గర పనిచేసే ఒక అమ్మాయి ఇల్లు తుడుస్తూ ఉండగా సోఫా కింద టాబ్లెట్లు కనిపించడంతో మోనిత కు అవి చూపించగా మోనిత షాక్ అవుతుంది. ఆ తర్వాత శివని పిలిచి మీ సార్ ఎక్కడ అని అడగగా నాకు తెలియడం ఆ వంటలక్క దగ్గరికి వెళ్లి ఉంటాడేమో అనడంతో అక్కడికి కోపంతో వెళుతుంది మోనిత.
ఒకవైపు కార్తీక్ రోడ్డు మీద నిలుచొని సౌర్య ఎక్కడ ఉన్నావు అంటూ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. మోనితకు భర్తగా నేను ఉండలేకపోతున్నాను దీప ఎలా అయినా ఆ మోనిత ని వదిలించుకుంటాను అంటూ తల పట్టుకుని ఎమోషనల్ అవుతాడు. ఇంతలోనే సౌర్య ఇంద్రుడు అటుగా మాట్లాడుతూ వెళ్తారు. మరొకవైపు దీప పని చేసుకుంటూ ఉండగా అక్కడికి మోనిత వస్తుంది.
వంటలక్క అని పిలవగా చెప్పే వంటలక్క అని వెటకారంగా మాట్లాడిస్తుంది దీప. కార్తీక్ ఎక్కడ అని అనడంతో ఇక్కడికి రాలేదు అని చెబుతుంది దీప. ఆ తర్వాత వారిద్దరు మాదించుకుంటూ ఉండగా నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ లోపల కార్తీక్ ఉన్నాడు అనడంతో ఇప్పుడు మోనిత, కార్తీక్,వంటలక్క కు నీకు ఎటువంటి సంబంధం లేదు నేనే నీ భార్య ని మోనిత అని చెబుతూ ఉండగా అది చూసి దీప నవ్వుకుంటూ ఉంటుంది.
Read Also : Karthika Deepam serial Oct 20 Today Episode : పోలీసుల నుంచి దుర్గను కాపాడిన కార్తీక్.. షాక్‌లో మోనిత..?