Karthika Deepam Aug 24 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో దీప కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ ఫోటో పట్టుకొని అందరిని అడుగుతూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దీపా ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు అని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక ఆమె వచ్చి కార్తీక్ ఫోటోని దీపక్ చూపించి ఇతను చూశారా అని అడుగుతుంది. దీప అది ఎవరు అని చూస్తే మోనిత.. దీపను చూడగానే నువ్వా అని అంటుంది మోనిత.
అప్పుడు దీప హాస్పిటల్ లో నర్స్ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు దీప మోనిత ను హాస్పిటల్ నుంచి డాక్టర్ బాబును తీసుకొని పోయింది నువ్వే కదా అని అంటుంది. అప్పుడు మోనిత నువ్వు ఇంకా నా డాక్టర్ బాబు బతికే ఉన్నాడా అని అంటుంది. అప్పుడు వెంటనే దీప నటించింది చాలు నా డాక్టర్ బాబు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని అంటుంది.
అప్పుడు నిజంగానే నా కార్తీక్ బతికి ఉంటే ఈ ఫోటో పట్టుకొని ఇలా ఎందుకు తిరుగుతాను చెప్పు అని అంటుంది. మరొకవైపు హిమ ఏడుస్తూ అమ్మానాన్నని తిరిగితేలేము కదా సౌర్యాన్ని అయినా తిరిగి తేవచ్చు కదా నానమ్మ అని అడగడంతో సౌందర్య ఎమోషనల్ గా కోపంగా మాట్లాడుతుంది. నీకు ఒకటే కాదు మాకు కూడా శౌర్య అంటే ఇష్టమే అది రాను అంటుంది మరి నేను ఏం చేయాలి అని అంటుంది.
Karthika Deepam Aug 24 Today Episode : కోపంతో రగిలిపోతున్న డాక్టర్ బాబు..?
అప్పుడు ఆనంద్ రావు సౌర్య ఎక్కడుందో తెలిసింది కదా వెళ్దామా అని అనగా, సౌర్య అక్కడే ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఒకవేళ ఉంటే రావాలనిపిస్తే ఫోన్ నెంబర్ ఉంది కదా అని అంటుంది సౌందర్య. ఆ తర్వాత సౌందర్య, ఆనంద్ రావ్ ఇద్దరు ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొకవైపు కార్తీక్, శివ ఇద్దరూ కారులో వెళుతూ ఉండగా అప్పుడు కార్తీక్ ఎక్కడ తీసుకొని వెళుతున్నావు అని అడగడంతో ఇంటి దగ్గరికి సార్ అని అనగా అప్పుడు కార్తీక్ ఎందుకయ్య నన్ను పంజరంలో ఉంచుతున్నారు ఇల్లు, కారు ఇవేనా నాకు అర్థం కావడం లేదు అంటూ చిరాకుగా మాట్లాడుతాడు.
అప్పుడు కార్తీక్ పొరపాటున అదేమైనా నా భార్యనా అని అనడంతో శివ ఆశ్చర్యపోతాడు. మరి లేకపోతే భర్తను ఎవరైనా ఇంతలా చూసుకుంటారా కొంచమైనా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా అని అంటాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య, దీప కార్తీక్ ఫోటోలు దగ్గర నిలబడి సౌర్య గురించి చెప్పుకుని ఎమోషనల్ అవుతుంది.
Read Also : Karthika Deepam: దీప, డాక్టర్ బాబే కాదండోయ్.. మోనిత కూడా ఎంట్రీ ఇచ్చేసింది!