Mohanlal: నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన… పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తనదైన శైలిలో నటిస్తూ… ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన విశ్వరూపం విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపోయిన్ మోహన్ లాల్.. ఈ విగ్రహంతో ఫొటోలు దిగారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు ఉన్నాయని.. అవి పూర్తి కాగానే వచ్చే వారంలో మోహన్ లాల్ ఇంటికి విగ్రహం వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
12 అడుగుల విరాట్ పురుషుని విశ్వరూప విగ్రహంలో 12 ముఖాలతో కూడి ఉంది. ఈ పదకొండు వేర్వేరు రూపాలతో విభిన్నంగా ఉంది. మహా భారతంలో భీష్మ పర్వంలో అర్జునుడు యుద్ధం చేయక అస్త్ర సన్యాసం చేసినపుడు కృష్ణుడు విరాట్ రూపంలో విశ్వరూపం సందర్శనం ఇచ్చారట. ఈ విగ్రాన్ని గామరి చెట్టు కలపతో చేయించారు. ఈ విగ్రహం తయారీకి దాదారు 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.