Sameera Reddy Baby Bump : సమీరా రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినీ రంగంలో చేసింది తక్కువ సినిమాలే అయినా… ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే 2013లో ఇంటర్ ప్రెన్యూర్ అక్షయ్ ను ప్రేమించి పెల్లి చేసకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకునేది. తన జీవతానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకునేది.

అయితే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా గతంలో ఆమె గర్భం దాల్చినప్పుడు తీసుకున్న మెటర్నిటీ ఫొటో షూట్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అందులో బేబీ బంప్ తో ఉన్న సమీరా.. బికినీలో దర్శనం ఇచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఆమె ఫోజులు ఇస్తుంటే… ఓ కెమెరామాన్ ఫొటోలు, వీడియోలు తీస్తుండటాన్ని వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆడవాళ్లు తమ శరీరాన్ని ప్రేమించే విధంగా ప్రోత్సహించేందుకు ఈ వీడియోను అభిమానులతో పంచుకుంటున్నట్లు ఆమె తెలిపింది. తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతో అందమైన బాడీని కల్గి ఉన్నానంటూ సమీరారెడ్డి పోస్టులో వెల్లడించింది. గర్భంలో తన బిడ్డలను మోస్తున్నప్పుడు గొప్ప అనుభూతిని పొందినట్లు తెలిపింది.
Read Also : Trolls on thaman: కాపీ కొట్టేటప్పుడు కాస్త చూస్కో తమన్.. నెటిజెన్స్ ట్రోలింగ్!