Viral video : కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేసిందో మనం ప్రత్యక్షంగా చూశాం. ఆ సాంగ్ క్రేజ్ ఇంకా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. వేరుశెనగలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పాడిన పాటకు కొంత మ్యూజిక్ యాడ్ చేయడంతో కచ్చా బాదం చాలా మందిని ఆకట్టుకుంది. ఇది ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ పాటపై తమదైన శైలిలో డ్యాన్స్ చేసి వాటిని సోషల్ మీడియోలో పంచుకున్నారు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సాంగ్ కు రీల్స్ చేశారు. భుబన్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారాడు. ఈ కచ్చా బాదం సాంగ్ చాలా మందిని ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఇప్పుడు కచ్చా బాదం సాంగ్ కు చెందిన మరో వీడియో వైరల్ అవుతోంది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి వేణువుపై కచ్చా బాదం సాంగ్ ట్యూన్ వాయించాడు. రోడ్డుపై బొమ్మలు అమ్ముకునే ఆ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కచ్చా బాదం పాట ఫ్లూట్ వర్షన్ సూర్యాగ్ని అనే యూజర్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
ఒడిశాలోని జగన్నాథ దేవాలయం ముందు వేణువు మీద ఒక వేణువు అమ్మే విక్రేత కచ్చా బాదం సాంగ్ వాయించాడు. 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది లైక్ చేస్తున్నారు.
#kachabadam fever hits #Puri #Odisha
Flute artist playing Bengal’s recent popular tune in front of #JagannathTemple #Puri pic.twitter.com/4XIlLmxQ0tAdvertisement— Suryagni (@Suryavachan) June 20, 2022
Advertisement