Malli Serial July 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో భాగంగా మా వాళ్లు ఏం చేసినా మీరు అర్థం చేసుకోండి అంటూ అరవింద్ కి దండం పెడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక మాలిని అమ్మ, వాళ్ళ నాన్న గార్లు అరవింద్ వాళ్ళ ఇంటికి వస్తారు. మాలిని వాళ్ళ అమ్మ సుమిత్ర గారు, అనుపమ గారు మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఒకటే ఊరికి వెళ్తుంది అంటుంది. ఏ ఊరు అని అనుపమ అనగానే నేలకొండపల్లి అంటుంది. మామ్ నేను నేలకొండపల్లి వెళ్లడం ఏంటి అని మాలిని అనగానే అవును నువ్వు నేలకొండపల్లి వెళ్ళాలి.

టికెట్స్ కూడా బుక్ చేశాను వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకో అంటుంది. అప్పుడు అనుపమ అరవింద్ వెళ్ళింది రెండు మూడు రోజుల పని మీదనే ఆ పని పూర్తి కాగానే వెంటనే వస్తాడు అంటుంది. అప్పుడు వసుంధర ఇంతకు ముందు కూడా అలాగే చెప్పి వెళ్ళాడు. కానీ వారం రోజుల తరువాత వచ్చాడు అప్పుడు మాలిని చాలా టెన్షన్ పడింది అంటుంది. మామ్ అప్పుడు అరవింద్ కి ఆక్సిడెంట్ అయింది కాబట్టి లేట్ అయింది అంటుంది మాలిని. అప్పుడు వసుంధర అన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు మనకి తప్పు చేయాలని ఆలోచన లేకపోయినా పరిస్థితులు మనల్ని తప్పు చేసేలా చేస్తాయి అంటుంది.
అప్పుడు రూప నేను మా తమ్ముని 25 ఏళ్లుగా చూస్తున్నాను. వాడు ఎలాంటి తప్పు చేయడు ఆ విషయం మాలిని కి కూడా తెలుసు అంటుంది. అప్పుడు వసుందర మన బంగారం మంచిది కావచ్చు కానీ అవతలి వాళ్ళ కళ్ళు మంచిగా ఉండవు అంటుంది. అప్పుడు మాలిని మామ్ అరవింద్ ఇంటర్వ్యూ పనిమీద వెళ్ళాడు దానికోసం అని అతను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడు నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలి. నాకు బోర్ కొడుతుంది ఇక్కడ అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నాకు అరవింద్ కూడా గుర్తుకు రావట్లేదు నేను ఇక్కడే ఉంటాను అంటుంది. అప్పుడు వసుంధర నువ్వు చెప్పింది నిజమే మాలిని భార్యలు భర్తల కి దగ్గరగా ఉంటే భర్తలు నిజంగానే ఇబ్బందిగా ఫీల్ అవుతారు.
Malli Serial July 23 Today Episode : మళ్లీ పెళ్లా.. పూజలేమొద్దు.. ఆ తాళినే దొరబాబుతో కట్టించుకుంటానన్న మల్లి
కానీ చెప్పేది నీ ఫ్యూచర్ బాగుండాలనే ఏమంటారు సుమిత్ర గారు మీరు ఇంట్లో పెద్దవారు కదా మీరు చెప్పండి అంటుంది. అప్పుడు సుమిత్ర మాలిని మీ కూతురు కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి అంటూ అనుపమ ,రూప పదండి వెళ్దాం అంటుంది. ఇక మల్లి అరవింద్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. అప్పుడు మీరా అక్కడికి వచ్చి ఇప్పుడే సీతారాముల గుడికి వెళ్లి వచ్చాను కుంకుమ తెచ్చాను ఇదుగో పెట్టుకో అంటూ మల్లికి కుంకుమ నిస్తుంది. ఇప్పుడు మల్లి కుంకుమ తీసుకొని నుదుటిన పెట్టుకుంటుంది అప్పుడు మీరా తాళిబొట్టు కి కూడా పెట్టుకో అంటుంది. అప్పుడు మల్లి తన మెడలో తాళిబొట్టు లేదని భయపడుతుంది. అక్కడికి మీర వాళ్ళ అమ్మగారు వస్తారు.

అప్పుడు మీరా మల్లి మెడను చూసి తాళిబొట్టు లేదు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మల్లి అమ్మ నేను హడావుడిలో ఊరికి తయారై వస్తూ ఉంటే తాళి పెరిగిపోయింది అంటుంది. అప్పుడు మీరా వాళ్ళ అమ్మ తాళి పెరిగిపోయిందా లేదంటే నువ్వే పక్కన పెట్టావా అంటుంది. అప్పుడు మీరా తాళి పెరిగిపోవడం అంటే.. అంత చిన్న విషయం కాదు దానికి శాంతి పూజలు చేయాలి లేదంటే నీ భర్తకు హాని కలుగుతుంది అంటుంది. మల్లి నువ్వు చిన్నపిల్లవి కాదు తాళి ఏమైనా ఆట వస్తువు అనుకుంటున్నావా? తాళి అనేది అలంకరణ కోసం మాత్రమే కాదు ఆడవారికి పెళ్లి తర్వాత జీవితం మొదలవుతుంది.
అసలు ఈ విషయం మీ అత్తగారికి చెప్పావా అంటుంది. లేదమ్మా చెప్పలేదు నేను వచ్చేటప్పుడు ఇలా జరిగింది అంటుంది మల్లి. మరి ఈ విషయం బాబు గారి కైన చెప్పావా అంటుంది. లేదమ్మా వచ్చే దారిలోనే చెప్పాను అంటుంది. అప్పుడు మీరా పెద్దమ్మ దగ్గరికి వెళ్లి పరిష్కారం అడుగుదాం ఈ రోజు శాంతి పూజలు చేద్దాం.. అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరా పెద్దమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ మల్లి మెడలో తాళి పెరిగిపోయింది. ఇలా జరిగితే అపశకునం అంటారు కదా ఎవరికైనా ఏమైనా జరుగుతుందేమో అని నాకు భయమేస్తుంది మీకన్నీ తెలుసు కదా మీరే పరిష్కారం చెప్పాలి అంటుంది. అప్పుడు పెద్దమ్మ తల్లి మల్లి మూల నక్షత్రం లో అమ్మవారి అంశతో పుట్టింది. మల్లి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి.
సంతోషాన్ని మాత్రమే పంచుకుంటుంది తన బాధను ఎవరికీ చెప్పదు. మల్లి పెళ్లి కూడా సరిగా జరగలేదు. పెళ్లైన ఆడపిల్లకి తాళి పెరిగిపోవడం అంత మంచిది కాదు కాబట్టి అరవింద్‌తో మల్లికి మళ్ళి తాళి కట్టించాలి. మరలా పెళ్లి చేయాలి అని చెప్తుంది. మల్లి కి పెళ్లినే కాదు కొన్ని తంతులు కూడా జరిపించాలి. అప్పుడే మల్లి జీవితం నీ జీవితం లాగా కాకుండా ఉంటుంది. ఏ ఒక్క తంతు జరగకపోయినా అరవింద్ బాబుతో మల్లి జీవితం సరిగా ఉండదు అంటుంది. అప్పుడు మీరా అంత మాట అనకమ్మ ఇప్పుడే అల్లుడు గారికి చెప్పి అన్ని తంతులు ఆచారాలు చేపిస్తాను. ఇవాళ పెళ్ళికి అన్నీ సిద్ధం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోతుంది. మల్లి ఒక్కతే కూర్చుని ఇప్పుడు శాంతి పూజలు అంటే అరవింద్ బాబు గారు ఒప్పుకోరు. ఒకవేళ కోపంతో నేను మల్లినీ ఇక్కడే వదిలేయడానికి వచ్చాను అని చెప్తే మా ఊరి వాళ్ళు దొర బాబు గారిని ఏమైనా చేస్తారు.

ఈ విషయం మాలిని అక్క కి తెలిస్తే బ్రతుకుతుంద అయ్యా తండ్రి మీరే కాపాడాలి అని దేవుని వేడుకుంటుంది. అప్పుడు మీరా అక్కడికి వచ్చి దొరబాబు గారికి నీకు మన ఊరి సత్తెమ్మ తల్లి ఆశీస్సులతో మళ్లీ పెళ్లి చేయాలంట అని చెప్తుంది. అప్పుడు మల్లి అమ్మ నేను హైదరాబాద్ వెళ్ళాక అక్కడున్న తాళిని దొర బాబు గారితో కట్టించుకుంటా.. అంతే కానీ ఇప్పుడు పెళ్లి వద్దు అని చెప్తుంది. అప్పుడు రవళి పెళ్లైన ఆడపిల్ల మెడలో తాళి లేకుండా పొలిమేర దాటకూడదు. దాటకూడదు అంటుంది. ఇప్పుడే మనం అతన్ని చాలా ఇబ్బంది పెట్టాము. ఇప్పుడు మళ్లీ పెళ్లి అంటే బాగోదు అనగానే మీరా వాళ్ళ అమ్మ పెళ్లి జరగాల్సిందే అంటుంది. అప్పుడు మల్లి హే నకిలీ నువ్వు మధ్యలో దూరి మాట్లాడకు అంటుంది.
అమ్మ ఆయనకు చాలా పనులు ఉన్నాయి దీనికి ఆయన ఒప్పుకోడు అడిగి మీ మాట పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది. అప్పుడు మీరా నువ్వు మా మాట పోతుందని బాధపడుతున్నావా అల్లుడు గారు చాలా మంచివారు ఒప్పుకుంటారు అని అరవింద్ దగ్గరికి వెళుతుంది. బాబు గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇక మల్లి, అరవింద్ లు మళ్లీ ఒకటి కాబోతున్నారో లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.