Malli Serial July 21 Today Episode : తెలుగులో ప్రసారం అవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్‌లో భాగంగా సత్య ఇంకా మీరా అరవింద్ కోసం లాడ్జికి వస్తారు. విషయం తెలుసుకున్న మల్లికూడా లాడ్జ్‌కు వస్తుంది. ఇకపోతే.. ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అరవింద్‌ను చూసి మీరా ఆనందపడిన మీరా.. మల్లిని తీసుకుని మమ్మల్ని చూసేందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. సారీ అని చెప్పడంతో వెంటనే మల్లి అమ్మా.. నువ్వు చెప్పాల్సింది సారీ కాదు.. థ్యాంక్యూ అని చెప్పాలని అంటుంది. అవును.. మల్లి చెప్పిందే బాబూ అంటుంది. మేమంతా ఎందుకు వచ్చామా అని చూస్తున్నారా బాబూ.. మిమ్మల్ని క్షమాపణలు అడుగుదామని వచ్చామంటాడు సత్య.
మా వాళ్లు కొంచెం మెరటవాళ్లు బాబూ.. చదువుకోలేదు కదా.. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు.. అందరి తరపునా నేను క్షమాపణ అడుగుతున్నానని సత్య అంటాడు. ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది కలగదదని అని ఊరి సర్పంచ్ అంటాడు. ఇంతలో సత్య.. అరవింద్.. పల్లెటూరి వాళ్లు అమాయకులు.. పట్నం వాళ్ళు వచ్చి మోసం చేసేవాళ్లు అనే భ్రమలో ఉండిపోయాం.. కానీ, మా ఆలోచన తప్పుని మీరు నిరూపించారు. పట్నం మనస్సులోనూ ప్రేమా, ఆప్యాయత, మంచితనం ప్రేమ ఉంటాయని తెలుసుకున్నామంటాడు. మా ఊళ్లో వారిందరి కంటే మీ మనస్సు చాలా గొప్పది.. మీరు గొప్పవారు.. మా అందరిని క్షమించండి బాబూ అంటాడు సత్య. అప్పుడు అరవింద్ అయ్యో.. సత్య.. మీరు చుట్టుపక్కల గ్రామాలకు దేవుడు లాంటి వారు.. మీరు నాకు క్షమాపణ చెప్తే వాళ్లు ఫీల్ అవుతారు అంటాడు.
వెంటనే సత్య మీరు మా ఇంటికి వస్తే మమ్మల్ని క్షమించినట్టే బాబు అంటారు. మీరు మా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే ఆ రోజు మళ్లీ అమల తిట్టి పంపించింది అని అంటాడు సత్య. అప్పుడు మీరా మల్లి నువ్వు చెప్పు.. మీ ఆయనకి నువ్వు చెప్తానే వస్తారు అనుకుంటా.. అంటుంది. వెంటనే మల్లి చేయాల్సిందంతా చేసి మళ్లీ రమ్మంటే ఎలా వస్తారు.. ఆయన రాడు.. ఆయనకి ఇక్కడ ముఖ్యమైన పని ఉంది. అది చూసుకొని వెళ్తాడు అంటుంది. అప్పుడు సత్య.. అరవింద్ బాబు మీకు నాతోనే పని ఉందని నాకు తెలుసు.. మీరు నాతో వస్తే నీకు అన్ని విషయాలు చెప్తాను.. ప్రామిస్ అంటాడు. అప్పుడు అరవింద్ సరే వస్తాను నేను పదండి అంటాడు.
ఇకపోతే అరవింద్ వాళ్ళమ్మ లక్కీ గురించి ఆలోచిస్తూ లక్కీ కాల్ చేసింది. లక్కీ లిఫ్ట్ చేసి చిరాకుగా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఊరికే ఎందుకు ఫోన్ చేస్తారు అంటుంది. వెంటనే మాలిని ఏం బాధపడకండి అత్తయ్య.. అప్పుడు అరవింద్ వాళ్ళ అమ్మ.. ఏడాది అయింది మాలిని లక్కీ మాట్లాడక అంటుంది. వెంటనే మాలిని లక్కీని నేను మారుస్తాను అత్తయ్య.. అది చిన్నపిల్ల తనకి ఏం తెలీదు అంటుంది. ఈరోజు మీకోసం స్పెషల్‌గా నేను వంట చేశాను తిందాం రండి అంటుంది.
Malli Serial July 21 Today Episode : అసలు మనకు జరిగింది పెళ్లే కాదంటూ మల్లిపై అరవింద్ ఆగ్రహం..
ఇక అరవింద్ మల్లితో కలిసి వాళ్ల ఊరికి వస్తాడు. అప్పుడు జగదాంబ ఏ మీరా అల్లుడు గారికి నన్నుపరిచయం చెయ్యరా అంటుంది. అప్పుడు జగదాంబ.. అల్లుడు నన్నుగుర్తుపట్టారా నేనే మీ పెళ్లి చేశాను అంటుంది. వెంటనే సత్య అల్లుడు గారికి తెలుసులే అత్తా అంటాడు. మల్లి జీవితం మీరు ఎప్పుడూ బాగుండాలని అనుకోరు.. అప్పుడు కూడా మల్లిని వదిలించుకోవాలని ఇలా చేశారు అంటాడు. అల్లుడుగారు మీరు మా మల్లిని పెళ్లి చేసుకున్నారు చాలా కృతజ్ఞతలు అంటాడు.
జగదాంబ మల్లి అక్కడ మహారాణిలా కోడలి హోదాలో ఉందో లేక పని మనిషిలా ఉందో నువ్వేమైనా చూశావా సత్య.. ఫస్ట్ అడగండి అల్లుడు గారిని అంటుంది. అప్పుడు వెంటనే మల్లి నేను వెళ్లడం లేదు.. ఆయనకి ఇక్కడ రెండు రోజులు పని ఉంది. ఆ పని చూసుకొని వెళ్తారు. నేను అమ్మ ఆరోగ్యం బాగు అయ్యాక కొన్ని రోజులు ఉండి వెళ్తాను అంటుంది. మీరా నా బిడ్డకి నేనంటే చాలా ప్రేమ బాబు.. నేనెప్పుడూ కోప్పడింది లేదు. మీరు కూడా అలాగే చూసుకుంటారు అనుకుంటా.. కానీ ఒక తల్లిగా చెప్తున్న మీరు ఎప్పుడు పంపించమంటే అప్పుడే మల్లిని పంపిస్తాను అంటుంది మీరా. మీ అందరికి చాలా కృతజ్ఞతలు అంటుంది.
ఇక అరవింద్ మల్లిని నిన్ను.. ఇక్కడ వదిలి వదిలించుకొని పోదామని నేను చూస్తుంటే.. అసలు మనకు జరిగింది పెళ్లే కాదని అనుకుంటున్నా అంటూ మల్లి మీద గట్టిగా అరిచేస్తాడు అరవింద్.మల్లిపై అరవింద్ పై కోపడుతున్న సమయంలో కిటికీలో నుంచి తల్లి మీరా చూస్తుంది. కూతురు, అల్లుడు ఏమి మాట్లాడుకుంటున్నారోలే అనుకుంటుంది. మల్లిపై అరవింద్ చిరాకు పడటం చూసి ఏమైందా అని మీరా చూస్తుంది. అక్కడితో సీరియల్ ఎండ్ అవుతుంది. ఇక మల్లి వాళ్ళ అమ్మ అసలు నిజం తెలుసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఇక రేపటి ఎపిసోడ్‌లో వరకు ఆగాల్సిందే.