...

Mahesh Babu : ఆ సినిమా టికెట్ కోసం క్యూలో నిల్చున్న మహేశ్ బాబు…!

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేశ్ బాబు వయసు పెరిగే కొద్దీ ఆయన గ్లామర్ కూడా రెట్టింపు అవుతోంది. మహేశ్ బాబు గ్లామర్ కి ఎంతో మంది అమ్మాయిలు ఆయనకి అభిమానులుగా మారుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరో ని తాకాలని చాలామంది అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కార్ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Mahesh Babu
Mahesh Babu

అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ సినిమాని మహేష్ బాబు నిర్మించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమ విడుదల తేది దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మహేశ్ బాబు చాలా కొత్తగా ఈ సినిమా ప్రమోషన్స్ చేశారు. ఇటీవల ప్రముఖ యూట్యూబ్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం, హీరో అడవి శేషు తో కలిసి ఒక వీడియో చేశారు.

ఆ వీడియోలో మొదట నిహారిక సినిమా టికెట్ కోసం ఓ థియేటర్ వద్ద క్యూలో నిల్చుంతుంది. తర్వాత కొందరు వ్యక్తులు ఆమె కంటే ముందు క్యూలో నిల్చుంటారు. దీంతో నిహారిక తెల్లమొహం వేసుకొని చూస్తుంది. కొంత సమయం తర్వత హీరో అడవి శేష్ వచ్చి ఆమె ముందు నిల్చుంటాడు. దీంతో నిహారిక అడవిశేష్ తో గొడవ పడుతుంది. వారు గొడవ పడుతున్న సమయంలో మధ్యలో మహేష్ బాబు వచ్చి క్యూలో నిల్చున్నాడు. దీంతో నిహారిక ఒక్కసారిగా మహేష్ బాబుని చూసి షాక్ అవుతుంది. తర్వాత మహేష్ బాబు నిహారిక ని చూస్తూ మా ఫ్రెండ్స్ ని కూడా పిలవచ్చా అని నిహారికని అడుగుతాడు. ఆమె సరే అనటంతో అందరూ వచ్చి క్యూ లైన్ లో నిలబడతారు. దీంతో క్యూ లైన్ పెద్దది అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషియల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Mahesh babu son goutham : పది పాసైన గౌతమ్.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ బాబు ఫ్యామిలీ!