...

Vishnu Priya : నా కల నెరవేరడానికి ఆయనే కారణం.. ఎమోషనల్ అయిన విష్ణు ప్రియ..!

Vishnu Priya : బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేస్తున్న వారిలో విష్ణు ప్రియ కూడా ఒకరు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా షో కి యాంకర్ గా చేసిన షో ద్వారా బాగా పాపులర్ అయింది. ఈ షో తర్వాత వేరే అవకాశాలు రాకపోవడంతో నటిగా సినిమాలలో నటించటానికి ప్రయత్నాలు చేస్తోంది. చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి తనకి ఎటువంటి అవకాశాలు లభించడం లేదు. దీంతో ఇక అమ్మడు హద్దుమీరి మరి ప్రవర్తిస్తోంది.

Vishnu Priya
Vishnu Priya

అందరి లాగే విష్ణు ప్రియ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అవకాశాలు తగ్గటంతో హాట్ ఫోటో షూట్ లతో డాన్సులతో రెచ్చిపోతోంది. పొట్టి బట్టలు వేసుకొని మాస్ స్టెప్పులు వేస్తూ డాన్స్ చేసే వీడియోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది. అంతేకాకుండా అందాలను ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇస్తూ తీయించుకున్న అందమైన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. విష్ణు ప్రియ ఇలాంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఎట్టకేలకు విష్ణుప్రియ పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది.

ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో ,
శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో సుధీర్ సరసన దీపికా పిల్లి, విష్ణుప్రియలు హీరోయిన్స్ గా ‘ నటించనున్నారు. తాజగా మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్ర యూనిట్ సినిమా విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ” హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ రాఘవేంద్ర రావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. రాఘవేంద్ర రావు గారితో కలిసి దిగిన ఫోటో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ రాసుకొచ్చింది.

Read Also :Vishnu Priya : తన డాన్స్ తో సోషియల్ మీడియాని షేక్ చేసిన విష్ణు ప్రియ.. ఆ ఊపుడెంటి అమ్మడు..!