...

Anasuya : చేతిలో కత్తి పట్టుకుని.. కొప్పులో పూలు పెట్టుకుని.. “చుక్క”లు చూపిస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Anasuya : బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్ అనసూయ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన అనసూయ ఎన్నో షో లకు యాంకర్ గా వ్యవహరించింది. అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ తో పాటు సూపర్ సింగర్ జూనియర్స్ షో కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలలో నటించి తన నటనతో అందరిని మెప్పించిన అనసూయ రంగమ్మత్త గా పేరు తెచ్చుకుంది.

Anasuya
Anasuya

టీవీ షోలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రతీ వారం తన అందమైన ఫొటోలు షేర్ చేస్తూ.. తన అందాలతో నెటిజన్స్ కి పిచ్చెక్కిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆమె చేసే ఎక్స్పోజింగ్ కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టీవీ సెలబ్రెటీలతో ‘ వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే సినిమా రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్‌ సీపాన దర్శకత్వం లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సుడిగాలి సుదీర్, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ విష్ణు ప్రియ,అనసూయ తదితరులు నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాలో అనసూయ “చుక్క” అనే ఒక అడవి జాతి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో అనసూయ పాత్రకి తగ్గట్టు ఆమె వేషధారణ కూడ ఉంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం కొత్త గెటప్ లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో అనసూయ చీర కట్టుకొని ,కొప్పున పూలు పెట్టుకొని , చేతిలో కత్తి పట్టుకుని ఉంది. ఈ గెటప్ లో అనసూయ అందాలు రెట్టింపు అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Anasuya : కొత్త షోలో యాంకర్ అనసూయ అందాల ఆరబోత.. ఏంటమ్మా ఇది!