Devatha Aug 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లోఆదిత్య,దేవి ఒక చోటికి పిలుచుకొని వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో దేవి స్కూల్ నుంచి తిరిగి రావడంతో మాధవ ఎక్కడికి వెళ్లావు అని అడగగా ఆఫీసర్ సారు నన్ను ఒక చోటికి పిలుచుకొని వెళ్ళాడు. అక్కడ పిల్లలు ఎవరూ లేకపోయినా సంతోషంగా ఉన్నారు. మరి నాకు మా అమ్మ ఉన్నాక నీ సంతోషంగా లేకపోతే ఎలా అందుకే ఈరోజు నుంచి నేను మా నాన్న గురించి ఆలోచించను మా అమ్మని మంచిగా చూసుకుంటాను అని అంటుంది దేవి.
Devatha Aug 16 Today Episodeఆదిత్యకు జాగ్రత్తలు చెప్పిన సత్య..
అప్పుడు రాధా కూడా తన కూతురు తన నాయన విషయంలో బాధపడుతుంటే ఆఫీసర్ సారు బాధను తొలగించాడు దేవికి ప్రతి విషయంలో ఆఫీసర్ తోడు ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి దేవిని తీసుకుని వెళుతుంది. అప్పుడు దేవి,రాధ మాటలకు మాధవ ఒక రేంజ్ లో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రాధను దక్కించుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ వేస్తే అది క్షణంలో పాడయింది ఎలా అయినా మరొక ప్లాన్ వేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మాధవ.
మరొకవైపు ఆదిత్య దేవి తనతో మాట్లాడిన మాటలు గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని సంతోష పడుతూ ఉంటాడు. ఇక తన కూతుర్ని నాన్న విషయంలో పడుతున్న బాధను తొలగించాను అని అనుకుంటూనే మళ్లీ ఆ మాధవ ఏదో ఒకటి చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో సత్య వచ్చి నువ్వు ఏ విషయం గురించి ఇంతలా బాధపడుతున్నావు. ఎందుకు బాధపడుతున్నావు అని అడగను? కానీ నువ్వు ఇలాగే ఉంటే ఆరోగ్యం పాడవుతుంది అని జాగ్రత్తలు చెబుతుంది సత్య.
అప్పుడు ఆదిత్య సత్య అబద్ధం చెబుతాడు. మరొకవైపు దేవి పడుకుని ఉండగా భాగ్యమ్మ రాధ దగ్గరికి వచ్చి రాధతో మాధవ గురించి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే దేవి లేవడంతో రాధ మంచినీళ్లు తాపీ బయటకు వస్తుంది. ఆ తర్వాత భాగ్యమ్మ, మాధవ తన తల్లి జానకి తో చేసిన పనుల గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత రాధ పని చేసుకుంటూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వచ్చి ఎప్పటిలాగే రాధ నిన్ను దక్కించుకుంటాను అన్న విధంగా మాట్లాడుతాడు.
అలాగే ఒకరికి ఫోన్ చేసి నలుగురు అనాధలను పంపించమని అంటాడు మాధవ. మరోవైపు ఆదిత్య కమల ఆరోగ్య జాగ్రత్తల గురించి అడుగుతాడు. ఆ తర్వాత మాధవ ఇంటికి కొందరు ఆఫీసు వారు దగ్గర సహాయం అందివ్వమని అడగడానికి రావడంతో ఇదే అవకాశం గా దొరికింది అని మాధవ వారి దగ్గర ఉన్న పేపర్లు తీసుకుంటాడు. మొత్తంగా మాధవ ఆలోచనలను బట్టి చూస్తే ఏదో సరికొత్త ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World