Devatha Aug 17 Today Episode : ఆదిత్యను పెనిమిటి అని పిలిచిన రాధ.. షాక్ లో మాధవ..?

Devatha Aug 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ ఎలా అయినా ఆదిత్య, దేవి ల మధ్య దూరం పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, భాష ఇద్దరూ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉండగా ఇంతలో మాధవ ఫోన్ చేసి రైతులు తమ కష్టం చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. పేపర్లు కూడా ఇచ్చారు. నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు మాటలు ఏదో తేడా కొడుతుంది అనుకున్న ఆదిత్య అక్కడికి వెళ్లాలి అనుకుంటాడు.

Madhava makes a plan to distance Devi from Adithya in todays devatha serial episode
Madhava makes a plan to distance Devi from Adithya in todays devatha serial episode

అప్పుడు భాషా నేను కూడా వస్తాను అనగా నేను ఆఫీసుకు వెళ్లలేదు అనడంతో నేను కూడా వస్తాను పటేలా అనగా భాష పై గట్టిగా అరిచి ఎక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆదిత్య. మరొకవైపు మాధవ భాగ్యమును పిలిచి ఇంట్లో కూరగాయలు అయిపోయాయి.

మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకుని రా అని చెప్పగా అప్పుడు భాగ్యమ్మ పెద్దావిడ చెప్పలేదు కదా అని అనగా నేను చెప్తున్నాను వెళ్లి తీసుకొనిరా అని గట్టిగా అనడంతో సరే అని బయలుదేరుతుంది భాగ్యమ్మ. మాధవ మాటలకు భాగ్యమ్మ అనుమాన పడుతుంది. ఆ తర్వాత మాధవ రాధా దగ్గరికి వెళ్లి ఆదిత్య వస్తున్నాడు అని చెప్పగా దేవి ఆఫీసర్ సారు వస్తున్నారా అని ఆనందపడుతుంది.

Devatha Aug 17 Today Episode : దేవిని పావుగా మార్చిన మాధవ్ కి రుక్కు సమాధానమేంటి….

Madhava makes a plan to distance Devi from Adithya in todays devatha serial episode
Madhava makes a plan to distance Devi from Adithya in todays devatha serial episode

మరొకవైపు సత్య ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది . అలాగే రాదను ప్రతిరోజు కలుస్తున్నాడా అన్న అనుమానం కూడా సత్యకు మొదలవుతుంది. మరొకవైపు మాధవ ఆదిత్య కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో ఆదిత్య రావడంతో దేవీ నవ్వుతూ వెళ్లి పలకరిస్తుంది. అప్పుడు అక్కడికి నలుగురు అనాధ పిల్లలు రావడంతో మాధవ దేవిని లోపలికి వెళ్లి డబ్బులు తీసుకునే రమ్మని చెబుతారు.

అప్పుడు మాధవ ఇదంతా కూడా నా ప్లాన్ అని రాధ తో చెబుతాడు. డబ్బులు ఇస్తూ మీ నాన్న నాకు తెలుసు అంటూ ఆ పాపకు లేనిపోని ఆశలు పెడతాడు మాధవ. ఆ మాటలకు ఆ పాప ఎమోషనల్ అవడంతో పక్కనే ఉన్న దేవి కూడా కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆదిత్య మధవ కాలర్ పట్టుకుని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు దేవి ఎమోషనల్ అవుతూ ఆదిత్య దగ్గరికి వచ్చి ఎలాగైనా మా నాన్న కావాలి అని అంటుంది. ఆ తర్వాత రాధ ఆదిత్యను పెనిమిటి అనడంతో మాధవ షాక్ అవుతాడు. మళ్లీ రాధ ఆఫీసర్ సారు అంటూ కవర్ చేస్తుంది.

Read Also : Devatha Aug 16 Today Episode : దేవి, రాధ మాటలకు కోపంతో రగిలిపోతున్న మాధవ.. ఆదిత్యకు జాగ్రత్తలు చెప్పిన సత్య..?