Devatha Aug 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కమలా కూతుర్ని చూడటానికి రాధ హాస్పిటల్ కి వస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో కి కిటకి దగ్గర నిలబడి కమలా కూతుర్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు అందరి మధ్యలోకి వెళ్లి కమలా బిడ్డను ఎత్తుకున్నట్లు ఊహించుకొని ఎమోషనల్ అవుతుంది. ఇంతలోనే భాగ్యమ్మ అక్కడికి వెళుతుంది. ఇప్పుడు భాగ్యమ్మ నీ చూసి భాష ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అత్త అని అడుగుతాడు. అప్పుడు కమలకు బిడ్డ పుట్టింది అని ఎలా తెలిసింది అని అనగా అప్పుడు ఆదిత్య పక్కనే ఉన్న రాధ ని చూసి ఎలాగో అలా తెలిసిందేమోలే అని అంటాడు.

Devatha Aug 19 Today Episode : మళ్లీ కొత్త ప్లాన్ వేసిన మాధవ..
ఆ తర్వాత భాగ్యమ్మ బిడ్డకి గాలి రావట్లేదు కిటికీ దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి కిటికీ దగ్గరికి తీసుకెళుతుంది. అప్పుడు రాధ ఆ బిడ్డను పట్టుకొని సంతోషపడుతుంది. అప్పుడు దేవుడమ్మ పిలవడంతో భాగ్యమ్మ అక్కడికి వెళ్ళిపోతుంది. మరొకవైపు రాధ పని చేసుకుంటూ ఉండగా మాధవ,రాధనీ పిలిచి ఎప్పటిలాగే మాట్లాడడంతో రాధ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అప్పుడు రాధ దేవి ఎప్పటికీ ఆఫీసర్ బిడ్డనే.
దేవికి ఆయనే నాయన అంటూ గట్టిగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రాధ. మరొకవైపు కమల కు బిడ్డ పుట్టిన ఆనందంలో అందంగా రెడీ చేస్తూ ఉండగా అది చూసిన దేవుడమ్మా దంపతులు సత్యకు కూడా బిడ్డ పుట్టాలి అని ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. మరొకవైపు రాధ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్యమ్మ అక్కడికి వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
మీ ముగ్గురు అక్క చెల్లెలను ఒకే దగ్గర చూడాలని ఉంది ఎలా అయినా కమల బిడ్డ బారసాలకు నువ్వు రావాలి అని భాగ్యమ్మ,రాధ ను ఆహ్వానిస్తుంది. నేను ఎలా వస్తాను అని రాధ అనగా ఎలా అయినా రావాల్సిందే నేను చచ్చిపోయే లోపు మీ ముగ్గురిని చూడాలనుకుంటున్నాను ఆటంతో రాధ ఎమోషనల్ అవుతుంది. మరోవైపు జానకి పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వచ్చి జీవిత పరీక్ష రాస్తున్నాను నీ చేతి గోరుముద్ద పెట్టు అమ్మ అని అంటాడు. అప్పుడు మాధవ మాటలు విన్న రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Read Also : Devatha Aug 17 Today Episode : ఆదిత్యను పెనిమిటి అని పిలిచిన రాధ.. షాక్ లో మాధవ..?