Devatha Aug 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి కనిపించకపోయేసరికి ఆదిత్య,రాధలు వెతుకుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో దేవి కనిపించడంతో రాధ ఎమోషనల్ గా వెళ్లి హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎందుకు దేవి ఇలా చెప్పకుండా వచ్చేసావు నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ రాధ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు దేవి నాయన కోసం తిరుగుతున్నాను నువ్వు చెప్పమంటే చెప్పడం లేదు. ఆఫీసర్ కి చెప్పినా సార్ పట్టించుకోవడం లేదు అని ఎమోషనల్ అవుతూ మాట్లాడడంతో ఆ మాటలు విన్న ఆదిత్య బాధపడుతూ ఉంటాడు.

adithya-makes-a-promise-to-devi-about-her-father-in-todays-devatha-serial-episode
అప్పుడు వెంటనే ఆదిత్య నువ్వేం బాధపడకు దేవి త్వరలోనే మీ నాన్నని తీసుకు వస్తాను. కానీ మీ అమ్మని ఇలా వదిలి వెళ్ళకు అని అనటంతో దేవి సరే అని వారితో పాటు బయలుదేరుతుంది. మరొకవైపు మాధవ ఇంట్లో అందరూ దేవీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవి కనిపించకపోయేసరికి జానకి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
Devatha Aug 12 Today Episode : మాధవకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య..?

adithya-makes-a-promise-to-devi-about-her-father-in-todays-devatha-serial-episode
అప్పుడు అందరూ బాధపడే దేవుని వెతకాలి అని బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే రాధ, దేవితో రావడం చూసి వారందరూ సంతోషపడతారు. అప్పుడు జానకి, దేవితో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు రామ్మూర్తి ఎక్కడికి వెళ్లావు బంగారు నీకోసం ఆఫీసర్ సారు కూడా వెతికాడు సొంత కూతురు ఎలా చేస్తున్నావు అని అనడంతో వెంటనే ఆదిత్య దేవి నా కూతురే అని అంటాడు.
ఆదిత్య మాటకు అందరూ షాక్ అవడంతో నా కూతుర్ల చూసుకుంటాను అంటూ మాట మారుస్తాడు ఆదిత్య. అప్పుడు మాధవ దేవితో ఎమోషనల్ గా మాట్లాడే ప్రయత్నం చేయగా వెంటనే దేవుని లోపలికి తీసుకెళ్లమని రాధాకు సైగలు చేస్తాడు ఆదిత్య. ఆ తర్వాత మాధవకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నా ఫ్యామిలీ జోలికి ఇంకొకసారి వస్తే బాగుండదు అని మాధవకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఆదిత్య.
ఆ తర్వాత ఆ దేవి తనతో ఆదిత్య మాట్లాడిన మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత రాధ దేవికి అన్నం పెడుతుండగా దేవి అన్నాన్ని విసిరేస్తుంది. అప్పుడే భాగ్యమ్మ వచ్చి ఏం జరిగింది అని అనటంతో వెంటనే దేవి నాకు మా నాన్న కావాలి అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పటివరకు ఇలాగే చేస్తాను అని అంటుంది. ఆదిత్య తనతో మాధవ మాట్లాడిన మాటలను తలచుకొని అమ్మనాన్న అందించిన మంచితనంతో మాధవను ఏమి చేయలేకపోతున్నాను అని బాధ పడతాడు.
Read Also : Devatha: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. దేవి కోసం వెతుకుతున్న రాధ,ఆదిత్య..?