Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవుడమ్మ భర్త మొదట సత్య గురించి ఆలోచించు అనడంతో దేవుడమ్మ ఆలోచనలో పడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ భర్త సత్య గురించి మాట్లాడుతూ గురించి ఒకసారి ఆలోచించు అక్కడ ఆదిత్య పట్టించుకోక ఇప్పుడు నువ్వు పట్టించుకోకపోయేసరికి తను ఒంటరిగా ఫీల్ అవుతోంది అని అంటాడు. అప్పుడు దేవుడమ్మ సరే అని అంటుంది.
రాధ ఉదయాన్నే నిద్ర లేచి చూసేసరికి దేవి కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం వెతుకుతుంది. అప్పుడు రామ్మూర్తి, జానకి లకు కూడా దేవి కనిపించట్లేదు అని చెప్పడంతో వాళ్లు కూడా భయపడుతూ వెతకడం మొదలు పెడతారు. ఇక అప్పుడే మాధవ రావటంతో మాధవకు అసలు విషయం చెప్పగా మాధవ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు.
ఇక దేవి ఎక్కడికి వెళ్ళింది అని రాధ భయపడుతూ ఉంటుంది. అయితే దేవి తన తల్లి రాధ ఫోటో తీసుకొని తండ్రి కోసం వెతుకుతూ ఉంటుంది. తండ్రి ఫోటో లేదు కనీసం తల్లి ఫోటో అయినా చూపిస్తే ఎవరైనా నిజం చెబుతారేమో అని అందరిని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మ ఎలా ఉంటుందో దేవుడమ్మ అవ్వకు తెలియదు ఆ ఫోటో చూపిస్తాను అంటూ అక్కడి నుంచి ఆటో ఎక్కి దేవుడమ్మ ఇంటికి వెళుతుంది దేవి.
మరొకవైపు ఆదిత్య దేవి ఫోటో చూస్తూ దేవుడమ్మ మాట్లాడిన మాటలు తలచుకుంటూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలోనే రాధ, ఆదిత్య కి ఫోన్ చేసి దేవి కనిపించడం లేదు అని చెప్పేసరికి ఆదిత్య షాక్ అవుతాడు. అప్పుడు ఆదిత్య ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగింది అంటూ రాధ ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.
ఆ తర్వాత ఆదిత్య రాధను తన కారులో తీసుకొని దేవిని వెతకడానికి బయలుదేరుతాడు. మరొకవైపు రామ్మూర్తి దంపతులు మాధవ కూడా దేవిని వెతుకుతూ ఉంటారు. ఇక దేవి దేవుడమ్మ ఇంటికి వెళ్ళగా అక్కడ దేవుడమ్మ లేదు గుడికి వెళ్ళింది అని చెప్పడంతో దేవి బాధపడుతుంది. మరొకవైపు దేవి కనిపించకపోయేసరికి జానకి బాగా ఎమోషనల్ అవుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World