Karthika Deepam Nov 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్ దీపకు పెట్టడం చూసి మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో మోనిత జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వస్తాడు.
మోనిత ఆనంద్ ఎక్కడ అనడంతో మోనిత ఏమీ తెలియనట్టుగా ఏ ఆనంద్ కార్తీక్ అనడంతో నీకేమైనా పిచ్చా లేకుండా మెంటలా ఏ ఆనందా అంటావేంటి అనగా వెంటనే మోనిత బాబు ఇంట్లో లేక 24 గంటలు అవుతుంది ఇప్పుడు అడుగుతున్నావు కార్తీక్ అని అనడంతో నువ్వు శివలత వాళ్ళ ఇంటికి పంపించావేమో అనుకున్నాము మోనిత అంటాడు. లేదు కార్తీక్ నువ్వు చాలా మారిపోయావు ఆ దీపం మోజులో పడి నన్ను బాబుని మరిచిపోయావు అని అంటుంది మోనిత.
అప్పుడు కార్తీక్ ఏంటి మోనిత ఇలా మాట్లాడుతుంది కొంపదీసి నాకు అర్థం గుర్తుకు వచ్చింది అన్న విషయం అర్థమైందా అని అనుకుంటూ ఉంటాడు. అవన్ని సరే బాబు ఎక్కడికి వెళ్ళాడు అనటంతో లేడు మన మధ్య వేరే మనిషి ఉన్నంతవరకు బాబు ఇక్కడికి రాడు అమెరికాకు పంపించేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దుర్గా దీప ఇద్దరు మాట్లాడుకుంటూ డాక్టర్ బాబులు నీకు ఏమైనా మార్పు కనిపించిందా దుర్గ అని దీప అడగగా లేదు దీపమ్మ ఎందుకు అలా అంటున్నావు అనటంతో ఈ మధ్యకాలంలో నా పైన చూపిస్తున్న కేర్ చూస్తే అలాగే అనిపిస్తూనే దుర్గ అని ఉంటుంది దీప. అది నీ మీద ఉన్న అభిమానంతో మోనిత మీద ఉన్న కోపంతో అలా ప్రవర్తిస్తున్నాడు దీపమ్మ అంటాడు దుర్గ.
అప్పుడు వారిద్దరూ కార్తీక్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు బాబుతో హిమ ఆట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సౌందర్య వస్తుంది. అప్పుడు హిమ సంతోషాన్ని చూసి సౌందర్య కూడా సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు నానమ్మ ఆనంద్ ని ఇంక మోనిత ఆంటీ తీసుకెళ్లదు కదా అని అనడంతో లేదు హిమ ఆ మోనిత గురించి నీకు తెలియదు అది ఇంటి మీద దాడి చేసే అయినా సరే బాబును తీసుకెళ్తుంది అనటంతో హిమ ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దీప బట్టలు ఉతుకుతూ మోనిత గురించి కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు.
Karthika Deepam Nov 15 Today Episode : సౌందర్యను చూసి టెన్షన్ పడుతున్న మోనిత..
అప్పుడు దీప మొన్నటికి మొన్న వాల్తేరు వాణి పెట్టి నన్ను చంపాలి అని చూసింది అనటంతో అది విన్న కార్తిక్ షాక్ అవుతాడు. అప్పుడు ఏమన్నావ్ దీప అనడంతో వెంటనే దుర్గా చెప్పే దీపమ్మ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని అంటాడు. అప్పుడు దీప జరిగింది మొత్తం వివరించడంతో మోనిత రోజుకి ఉన్మాదిలా తయారవుతుంది అనుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ విషయాలు నాకెందుకు చెప్పలేదు దీప అనటంతో ఎన్నిసార్లు అని చెప్పాలి డాక్టర్ బాబు ఎన్నని చెప్పాలి అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది దీప. అప్పుడు కోపంతో రగిలిపోయిన కార్తీక్ వెంటనే మోనిత దగ్గరికి బయలుదేరుతాడు. మరొకవైపు ఆనందరావు సౌందర్య కి సౌర్య విషయంలో జరిగింది మొత్తం వివరిస్తాడు.
నన్ను చూసి ఆ మోనిత ఎందుకు టెన్షన్ పడుతోంది సౌందర్య అనడంతో నేను రేపు వెళ్ళి దాని సంగతి ఏంటో తేల్చుకుని వస్తాను అని అంటుంది. అలాగే ఆ సౌర్య ని బెదిరించే వాళ్ళ పని కూడా చెప్పి వస్తాను అని అంటుంది సౌందర్య. మొదట ఆ మోనిత పని పడతాను అంటుంది సౌందర్య. మరొకవైపు కార్తీక్ నువ్వు అసలు మనిషివేనా మోనిత ఎందుకు ఆ వంటలక్క ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు అని అనడంతో అప్పుడు మోనిత వంటలక్క కార్తీక్ గురించి లింకులు పెడుతూ తప్పుగా మాట్లాడడంతో మోనిత కు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ మోనిత ఏంటి ఇలా మాట్లాడుతుంది.
నా మీద అనుమాన పడినట్టు ఉంది ఆ అనుమానం రాకుండా చూసుకోవాలి అని అనటంతో వెంటనే ప్లేట్ ఫిరాయించిన కార్తీక్ నువ్వు నా భార్యవి మోనిత నిన్ను ఎవరైనా ఏమైనా అంటే ఈ తట్టుకుంటానా. ఆ దీప ని చంపి జైలుకు వెళ్తే నేనేం కావాలి అని అంటాడు కార్తీక్. అప్పుడు వెంటనే మోనిత ఏంటి కార్తీక్ ఇలా ప్లేట్ ఫిరాయించాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నిజం చెప్పు మోనిత నువ్వు నిజంగానే నా భార్య వేనా లేకపోతే ఆ వంట లెక్క నా భార్య నా అని అడుగుతాడు. ఎందుకు ఆ డౌట్ వచ్చింది కార్తీక్ అని అనడంతో దీపను చంపి తన భర్త అయిన నన్ను నువ్వు సెట్ చేసుకోవాలని చూస్తున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది అంటాడు కార్తీక్. లేదు కార్తీక్ అని గట్టిగా అరుస్తుంది మోనిత.
Read Also : Karthika Deepam: కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేసిన మోనిత.. మోనితకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వంటలక్క..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World