Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్, మోనిత తో వంటలక్క గురించి మాట్లాడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ మరి నువ్వు నా భార్యవి అయితే ఎందుకు ఆ దీప అడ్డు తొలగించాలి అని చూస్తున్నావు. దీప నా భార్య కాబట్టి తన అడ్డు తొలగించుకొని నన్ను నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావా మోనిత అనడంతో లేదు దీప నీ భార్య అన్న ఆలోచన కలలో కూడా రానీయద్దు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వే వచ్చేలా చేస్తున్నావు మోనిత అని అంటాడు. అప్పుడు మోనిత కార్తీక్ ముందు దొంగ ప్రేమలు ఉన్నట్టు నటిస్తూ తన భర్త పరాయి ఆడదానితో తిరిగితే ఏ ఆడది సహించలేదు కార్తీక్ అని అనడంతో ఈ నటిస్తున్నావే అని అనుకుంటాడు కార్తీక్.
మరొకవైపు దీప పని చేసుకుంటూ ఉండగా ఇంతలో దుర్గ అక్కడికి వెళ్లి దీపమ్మ నువ్వు చెప్పింది నాకు నిజమనిపిస్తోంది డాక్టర్ బాబుకు గతం గుర్తుకు వచ్చిందని నాకు అనిపిస్తోంది అని అంటాడు. నీకు ఆ అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది దుర్గ అని అనగా ఆయన ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తోంది కానీ నువ్వే తన భార్యవి అని తెలిస్తే ఆ మోనితను కొట్టి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు కదా అన్న అనుమానం కూడా వస్తుంది దీపమ్మ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను దుర్గ అని ఉంటుంది దీప. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ నో డౌట్ దీపమ్మ కచ్చితంగా డాక్టర్ బాబుకి క్రితం గుర్తుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు.
మరొకవైపు ఇంద్రుడు బయటికి వెళ్తూ ఉండగా అప్పుడు శౌర్య నేను కూడా వస్తాను బాబాయ్ అని అనడంతో వద్దు అనగా శౌర్య మాత్రం బలవంతంగా ఇంద్రుడు వెనకాలే బయలుదేరుతుంది. ఆ తర్వాత దీప బయటకు వెళ్లాలి అని వెళుతుండగా ఇంతలో మోనిత ఎదురుపడి చావుకి ముహూర్తం ఫిక్స్ చేశాను మరి కొన్ని గంటల్లో నువ్వు చనిపోతున్నావు అంటూ దీపకు వార్నింగ్ ఇవ్వడంతో దీప నువ్వు చంపేస్తే ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు మోనిత అని అంటుంది. అప్పుడు నేను ఎలాంటి దానో తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్నావు జాగ్రత్త అని దీపకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మోనిత.
ఒకవైపు రెస్టారెంట్ కి వెళ్లిన మోనిత రెస్టారెంట్ లో ఉన్న ఫుడ్ ని మొత్తం తెప్పించుకొని తింటూ ఉండడంతో పక్కనే అది చూసి చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అత్త అక్కడికి వచ్చిన అతన్ని ఎందుకురా అలా చూస్తున్నావు అని అతనిపై సీరియస్ అవుతుంది మోనిత. మరోవైపు ఇంటికి వచ్చిన దీప మోనిత అన్న మాటలు తలచుకోని కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏమి అయ్యింది దీప ఎందుకు అంత కోపంగా ఉన్నావు అనడంతో అప్పుడు దీప అసలు విషయం చెప్పేసరికి కార్తీక్ షాక్ అవుతాడు.
ఈరోజు ఆ మౌనిత అంతు చూస్తాను దాని సంగతి ఏంటో ఈరోజు తేల్చేస్తాను అని దీప అక్కడికి కోపంగా బయలుదేరగా కార్తీక్ వద్దు అనవసరంగా గొడవలు ఎందుకు దీప అనే దీపకు సర్ది చెప్పినా కూడా దీప వినిపించుకోకుండా అక్కడికి కోపంగా బయలుదేరుతుంది. మరొకవైపు హోటల్లో మౌనిక తిని బిల్లు తీసుకొని రాపో అనడంతో మీ బిల్లు ఆవిడ కట్టేశారు మేడం అనగా మోనిత అటువైపు చూడడంతో అక్కడ సౌందర్య ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడికి వెళ్లిన మోనిత బాగున్నారా ఆంటీ ఏంటి ఇలా వచ్చారు ఆడడంతో అది సరే ఏంటి అంత ఫుడ్డు తింటున్నావు అని అనగా అదేం లేదు ఆంటీ నిన్న ఆనంద్ కార్తీక్ గుర్తుకు వచ్చారు.
అందుకే తినలేదు అందుకే ఇవాళ కొంచెం ఎక్కువగా తిన్నాను అని అబద్ధం చెబుతుంది మోనిత. అది బాధతో తిన్నట్టుగా లేదు కోపంతో తిన్నట్టుగా ఉంది అని అంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య అన్ని ఇక్కడే మాట్లాడతావా లేకుంటే ఇంటికి వెళ్దామా అని అనగా ఇంటికి అనడంతో ఇక్కడ నాకైతే ఇల్లు లేదు మీ ఇంటికి వెళ్దాం పద అనటంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు సౌందర్య ఎలా అయినా వెళ్లాలి అనుకునేసరికి ఈ ఆంటీ నన్ను విడిచిపెట్టలేలా లేదు పిలుచుకుని వెళ్ళాలి అని సరే ఆంటీ వెళ్దాం పద అని అక్కడ నుంచి సౌందర్య మోనిత ఇద్దరూ బయలుదేరుతారు. మరోవైపు సౌర్య ఆటోలో దీప వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంద్రమ్మ దంపతులు కావాలనే సౌర్య మనసుని మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు.