Janaki Kalaganaledu serial Oct 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ కుటుంబం అందరూ గుడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడు రామచంద్ర,జానకి పొంగలికి కావలసినవి సంచిలో సర్దుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ వెళ్ళామా అని అనగా ఒక్క నిమిషం అత్తయ్య గారు మల్లిక వాళ్ళు వస్తే వెళ్ళిపోదాం అని అంటుంది. ఇంతలోనే మల్లిక సంచి తీసుకుని బయటకు వస్తుంది.

ఏంటి మల్లికా ఆ సంచి అని జానకి అడగగా రేపటి నుంచి ఎలాగో విడిపోతున్నాం కదా అందుకే దసరా రోజు మా సొంత పొంగలి మేము చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాము అని అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి వెళ్దాం పదండి అని అనగా లేదులే రేపటి నుంచి ఎలాగో వేరు కాపురం పెడతాము కదా మమ్మల్ని మాలా ఉండనివ్వండి కుటుంబాలతో కలపొద్దు మా ఆయన నేను ఆటోలో వెళ్దాం అని మల్లిక విష్ణు ని ఆటోలో వెళ్లిపోతారు.
Janaki Kalaganaledu అక్టోబర్ 21 ఎపిసోడ్ : జ్ఞానాంబ కుటుంబం.. అమ్మవారికి బోనాలు..
తర్వాత జానకి జెస్సిని కారులో కూర్చోమని చెప్పగా సరే అని అంటుంది. అప్పుడు అఖిల్ వచ్చి మనం కూడా రేపటి నుంచి ఎలాగో వేరుగా వెళ్తున్నాం కదా నా దగ్గర పని లేదు నడుచుకొని వెళ్లడం అలవాటు చేసుకుందాం అని అనగా ఇప్పుడు జెస్సి ఏంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు. అక్క బావ ఏదో కోపంలో అలా అన్నారు అలా అని మనం ఇలా చేస్తే కష్టాలు వస్తాయి వేరు కాపురం పెట్టలేము మనం చేయలేము అని అంటుంది.
దాంతో అఖిల్ ఇప్పుడు నువ్వు వస్తావా రావా అనటంతో ఏం చేయలేక అఖిల్ వెంట వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ జరిగిన విషయాల గురించి ఆలోచించుకుంటూ గుండె నొప్పితో కింద పడిపోతుంది. తర్వాత జ్ఞానాంబ చూసావా జానకి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అని అనగా జానకి మొదట మనం గుడికి వెళ్లొద్దాం అత్తయ్య తర్వాత సమస్యను పరిష్కరించుకుందామని అంటుంది.
అప్పుడు జ్ఞానాంబ నా మనసు ఏం బాగోలేదు జానకి మీరు వెళ్లి రండి అని అనగా ఈరోజు పండుగ కదా అత్తయ్య రండి ఏం కాదు అని జానకి,జ్ఞానాంబను ఒప్పిస్తుంది. మరొకవైపు నీలావతి బదులుగా ఇద్దరు వేరే వాళ్ళని పంపిస్తుంది. అప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ కథ నా ప్లాన్ మొత్తం వివరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మల్లికా విష్ణులు గుడి దగ్గర పొంగలి చేస్తూ ఉంటారు.
ఇంతలోనే అక్కడికి జానకి వాళ్ళు వస్తారు. అప్పుడు పక్కనే మల్లిక వాళ్ళ మనుషులకు మాట్లాడమని సైగ చేస్తుంది. అప్పుడు వాళ్లు ఏంటి మల్లిక ఒక్కదానివే పొంగలి చేస్తున్నావు అని అనడంతో వెంటనే మల్లిక రోజులన్నీ ఒకేలా ఉండవు కదా పెద్దమ్మ అని అనటంతో ఏం మాట్లాడుతున్నావ్ మల్లిక అని అనడంతో వెంటనే జానకి అడ్డుపడి మల్లిక దానికి కూడా ఒక హద్దు ఉంటుంది మల్లిక నోరు మూయించి ఆ ఆడవారిని తిట్టి అక్కడ నుంచి పంపిస్తుంది జానకి.ఆ తర్వాత జానకి, మల్లికను అరవగా మల్లిక నామీద పెత్తనం చెలాయిస్తున్నావా అని అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి అమ్మవారికి బోనాలు తీసుకొని వెళ్తారు.
Read Also : Janaki Kalaganaledu: అఖిల్ ని మరింత రెచ్చగొట్టిన మల్లిక.. విష్ణు మాటలకు షాక్ అయిన రామచంద్ర..?