Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జ్ఞానాంబ విజయదశమి దాటిన తర్వాత ఎవరి కాపురాలు వారివే అని చెబుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ పండుగ అయిపోయిన తర్వాత ఎవరి వాటాలు వారివి ఎవరి కాపురాలు వాళ్ళవి వెళ్లిపోండి అని అంటుంది. అప్పుడు గోవింద రాజులు ఆలోచించుకో జ్ఞానం పిల్లలు ఏదో తెలియక మాట్లాడారు అని అనగా ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు అని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అఖిల్ ఒంటరిగా నిలుచుని అనవసరంగా తొందర పడ్డానా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే మల్లిక అక్కడికి వచ్చి ఏంటి అఖిల్ కొంపదీసి మనసు మార్చుకుంటాడా అనుకొని అక్కడికి వెళుతుంది.
అప్పుడు మల్లిక, జానకి రామచంద్ర ల మీద లేనిపోని నిందలు వేస్తూ అఖిల్ ని మరింత రెచ్చగొడుతుంది. ఇక్కడ ఉంటే అత్తయ్య గారి ముందు నువ్వు ఎప్పుడు మంచి వాడివి అవ్వలేవు జానకి నిన్ను అత్తయ్య గారు ముందు మంచి వాడిని చేయలేదు. వేరే కాపురం పెట్టే నీ కాల మీద నిలబడితే నీకు గౌరవం ఉంటుంది నా మాట విను అని అఖిల్ ని రెచ్చగొడుతూ ఉండగా ఆ మాటలు విన్న జానకి అక్కడికి వస్తుంది.
అప్పుడు చూడు మల్లికా నువ్వు కావాలని అఖిల్ ని చెడగొడుతున్నావు పాపం మకిలికి ఏం తెలియదు చూడు అఖిల్ నువ్వు ఉమ్మడి కుటుంబంలో ఉంటే విలువలు ఆనందాలు వేరు కాపురం పెడితే ఉండవు అని అనగా నేను చిన్న వదిన చెప్పిన మాటలే వింటాను అని అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అఖిల్ మాటలకు మల్లిక సంతోషపడుతూ ఉంటుంది.
మరొక వైపు జరిగిన దాన్ని తలుచుకొని విష్ణు ఆలోచనలో పడతాడు. ఇప్పుడు రామచంద్ర వచ్చి విష్ణు ని ఎంత బతిమిలాడినా కూడా విష్ణు మల్లికా వల్ల తన అన్నయ్య ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అని మనసులో మేము వెళ్ళిపోతాం అన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విష్ణు. దాంతో రామచంద్ర షాక్ అవుతాడు.
ఆ తరువాత జ్ఞానాంబ, గోవిందరాజులు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రామచంద్ర జానకి వస్తారు. అప్పుడు జానకి జ్ఞానాంబతో, అత్తయ్య గారూ మేము మాట్లాడుకున్న మాటలు మల్లిక విని తను ఇంకొకటి అర్థం చేసుకొని ఇంట్లో వాళ్లకు చెప్పింది ఈ గొడవ అంతా తమ వల్లే వచ్చింది. అయినా వాళ్ళు ఏవి తెలియక మాట్లాడుతున్నారు.
ఇప్పుడు వాళ్ళు వేరు కాపురం పెడితే సమాజాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు, చిన్నపిల్లలు. అసలకే మల్లిక, జెస్సి ఇద్దరు కడుపుతో ఉన్నారు నెలలు నిండుతున్న కొద్ది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఎవరు వాళ్ళకి చేయలేక చాలా కష్టంగా ఉంటుంది అని అనగా నేను ఎవరి మాట వినను నా మాట ఫైనల్ అని అంటుంది జ్ఞానాంబ. మరొకవైపు మల్లిక వేరే కాపురం పెడుతున్నందుకు మల్లిక ఆనందంతో డాన్సులు వేస్తూ ఉంటుంది. అఖిల్ మొబైల్ చూస్తూ ఉండగా జెస్సి జరిగిన విషయం తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. రామచంద్ర కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తూ దిగాలుగా కూర్చుని ఉంటాడు.