Guppedantha Manasu july 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సాక్షి రిషి కోసం ప్లాన్ చేసుకొని కాఫీ తీసుకొని వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో రిషి కోసం సాక్షి కాఫీ తీసుకొని రాగా ఇంతలో గౌతమ్, థాంక్స్ సాక్షి ఇప్పుడే అనుకున్నాను అంతలోనే కాఫీ తీసుకుని వచ్చావు అంటూ ఒక కాఫీ కప్ తను తీసుకొని ఇంకొక కాఫీ కప్పు రిషికి ఇవ్వడంతో తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. అప్పుడు గౌతమ్ కాఫీ తాగావా వసు అని అడగగా సాక్షి చేతిలో ఉన్న ప్లేట్ చూసి కావాలనే వసుధార లేదు సార్ తాగలేదు తల బద్దలవుతుంది అని అనగా వెంటనే రిషి సరే నా కాఫీ ని షేర్ చేసుకుందాం వసు అనడంతో సాక్షి కోపంతో రగిలిపోతుంది. అప్పుడు సాక్షి ముందే రిషి సాసర్ లో కాఫీ తాగగా వసుధార మాత్రం కప్పులో కాఫీ తాగుతుంది.
Guppedantha Manasu జూలై 16 ఎపిసోడ్ : సాక్షి తెచ్చిన కాఫీని సగం సగం పంచుకున్న రిషి, వసు..
అది చూసి సాక్షి మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎలా అయినా గౌతమ్, రిషిల ముందు వాసుని అవమానించాలి అనుకొని వసుధార డ్రస్సు విషయంలో కామెంట్స్ చేస్తూ వసుని వారి ముందు అవమానిస్తూ బాధపెడుతుంది సాక్షి. ఆ తర్వాత జగతి దేవయాని దగ్గరికి వెళ్లి దేవయానితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాక్షి రావడంతో సాక్షికి దేవయానికి ఇద్దరికీ కలిపి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది జగతి.
మరొకసారి రిషి విషయంలో ఏదైనా ఒక్క ప్లాన్ వేసినా కూడా మర్యాదగా ఉండదు. అంతేకాకుండా నేను నేరుగా వెళ్లి మీరు ఇద్దరు చేసే కుట్రలు అన్నీ కూడా రిషి కి చెప్తాను అనడంతో సాక్షి దేవయాని ఇద్దరు ఒక్కసారికి షాక్ అవుతారు. అప్పుడు దేవయానికి మీరు సాక్షి మనసు చెడగొట్టొద్దు అంటూ గట్టిగా చెబుతుంది.
జగతి మాటలకు సాక్షి దేవయాని ఇద్దరు వణికిపోతూ ఉంటారు. మరొకవైపు జగతి మహేంద్ర.ఇద్దరూ కార్ లో వెళుతూ ఉండగా అప్పుడు జగతి పరధ్యానం తో మాట్లాడకుండా ఉండడంతో మహేంద్ర ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో దేవయాని గురించి చెబుతుంది జగతి. అప్పుడు వారిద్దరు కొద్దిసేపు దేవయాని చేస్తున్న ప్లాన్ ల గురించి మాట్లాడుకుంటారు.
కాలేజీలో జగతి వర్క్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార వచ్చి ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోయే వరకు నువ్వు మీ రిషి సార్ పక్కనే ఉండాలి అని అంటుంది. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే సాక్షి అక్కడికి వస్తుంది. అప్పుడు సాక్షి కావాలనే ఋషిని తనని కలుపుకొని మాట్లాడుతూ ఉండగా జగతికి సహనం నశించి మళ్లీ సాక్షి కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
కానీ సాక్షి మాత్రం రిషి కావాలి అని అనడంతో పక్కనే ఉన్న వసు కోపంతో రగిలి పోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో వసుధార కోసం రిషి బట్టలు తీసుకుని వస్తాడు. అవి తీసుకోమని చెబుతూ ఉండగా ఇంతలో సాక్షి అక్కడికి వచ్చి ఆ బట్టలన్నీ చూసి షాక్ అవుతుంది. అప్పుడు వసుధార ఆ బట్టలు తీసుకుని ఇవ్వకుండా తన మాటలతో బాధపెడుతుంది సాక్షి.
Read Also : Guppedantha Manasu July 15 Today Episode: వసు జ్ఞాపకాలతో పిచ్చెక్కిపోతున్న రిషి.. మళ్లీ దగ్గరవుతున్న వసు..?