వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Guppedantha Manasu : డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుని రిషికి షాక్ ఇచ్చిన మహేంద్ర..?

Guppedantha Manasu March 16th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. వసు కాలేజీలో జరిగిన విషయానికి జగతి ఏం చేస్తుందో కంగారుపడుతూ ఇంటికి వస్తుంది. తలుపులు తెరిచి చూసి వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ జగతి ఏమి జరగలేదు అన్నట్టుగా కూల్ గా కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడు వసు మేడమ్ ... Read more

By Ramesh Babu

Published on: March 16, 2022 9:44 AM

Updated on: March 16, 2022 8:40 PM

Guppedantha Manasu March 16th Today Episode

---Advertisement---

Guppedantha Manasu March 16th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. వసు కాలేజీలో జరిగిన విషయానికి జగతి ఏం చేస్తుందో కంగారుపడుతూ ఇంటికి వస్తుంది. తలుపులు తెరిచి చూసి వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ జగతి ఏమి జరగలేదు అన్నట్టుగా కూల్ గా కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడు వసు మేడమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినందుకు మీకు బాధగా లేదా అని అడగగా నాకు ప్రాజెక్టు కంటే కొడుకు ముఖ్యం అని చెబుతోంది.

అలా వారిద్దరూ కాసేపు ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల గురించి, రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు గౌతమ్,అరేయ్ రిషి ఏమి అయింది రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని అడగగా రిషి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న ధరణి రిషి కో ఏమయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

Guppedantha Manasu March 16th Today Episode
Guppedantha Manasu March 16th Today Episode

ఇక మరొకవైపు మహేంద్ర జగతి ఇంటికి వచ్చి నువ్వు టెన్షన్ పడుతున్నాను అనుకుంటే నువ్వు ఏంటి ఇలా కూల్ గా ఉన్నావు అని అడుగుతాడు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినందుకు జగతి సిటీ వదిలేసి వెళ్లి పోతుంది అని మహేంద్ర మనసులో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని తాను వేసిన ఒక ప్లాన్ ను మహేంద్ర, వసు కి చెబుతుంది. మహేంద్ర జగతి ప్లాన్ విని ఆశ్చర్యపోతాడు.

Guppedantha Manasu March 16th Today Episode :

మరొకవైపు రిషి,వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ వారి మధ్య కొద్ది సేపు ఫన్నీగా యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే వసుధార, రిషి కోసం కాఫీ, ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంది.అప్పుడు రిషి కి అర్థం కాక తన మాటలు తనకే చెబుతున్నావ అని అడుగుతాడు. అప్పుడు రిషి,వసు కోపం గా ఉంటుంది అనుకుంటే ఏంటి ఇంత సంతోషంగా ఉంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు.

నీ ఉత్సాహానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అనేది మెసేజ్ చేసి అడగగా, ఉత్సాహం మంచిదే కదా సార్ అంటూ రిప్లై ఇస్తుంది. మరొకవైపు మహేంద్ర,రిషి నీకు ఇష్టమైన నిర్ణయాలు నువ్వు తీసుకున్నప్పుడు నాకు నచ్చిన నిర్ణయాలు నేను తీసుకుంటాను అని చెప్పి కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవినుంచి తప్పుకుంటున్నట్లు రిషి తో చెబుతాడు. ఆ మాట విన్న రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu : కోపంతో రగిలిపోతున్న వసు.. మహేంద్ర పై విరుచుకుపడ్డ రిషి..?

, , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel