Intinti Gruhalakshmi: కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రస్తుతం సామ్రాట్ రావడంతో కాస్త ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే రోజురోజుకు ఈ సీరియల్ పై ప్రేక్షకులు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఇకపోతే నేడు ఈ సీరియల్ ఆసక్తికరంగా మారింది. మరి నేటి ఎపిసోడ్లో భాగంగా… నందు లాస్య మాట్లాడుతూ లాస్య పై ఎంతో కోపం వ్యక్తం చేస్తాడు.అసలు సామ్రాట్ తో నన్ను పోటీలో దిగమని ఎందుకు చెప్పావు అని నందు అరవగా నువ్వు సామ్రాట్ పై గెలవాలని నీ సంతోషం కోసమే అలా చేశానని చెబుతారు.మొత్తానికి నువ్వు గెలిచావు నందు అని లాస్య చెప్పగా నేను గెలవలేదు అంటూ షాక్ ఇస్తాడు.
నేను ఓడిపోతున్న సమయంలో తులసి సామ్రాట్ కు తాను ఓడిపొమ్మని సైగ చేసింది. అది నేను చూశాను అంటూ నందు అసలు విషయం చెబుతాడు. నాకు అసలు ఈ విషయం తెలియదని లాస్య చెప్పగా, ఇలా గెలవడం కన్నా ఓడిపోయి ఉంటే బాగుండేదని నందు అంటాడు. రోజురోజుకు సామ్రాట్ తులసి మరింత దగ్గరవుతున్నారు అంటూ నందు మండిపడతారు. తనకు ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని తన ఉద్యోగం మానేస్తానని చెప్పడంతో లాస్య షాక్ అవుతూ ఏంటి ఉద్యోగం మానేస్తావా…ఈ జాబ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డామో తెలీదా..అలాంటిది ఈ జాబ్ మానేస్తానని ఎలా అంటావు అసలు వారి గురించి ఆలోచించడం మర్చిపో అంటూ లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇకపోతే సామ్రాట్ తనకు కానుకగా ఇచ్చిన మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్ అక్కడే వదిలేసి వెళ్లడమే కాకుండా సామ్రాట్ బాబాయ్ అన్నమాటలకు తులసి బాధపడి వెళ్లడంతో సామ్రాట్ అతని బాబాయ్ ఇద్దరు కలిసి తులసి ఇంటికి వెళ్తారు. అలాగే తనకు తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానుకగా ఇవ్వడంతో తులసి సంతోషపడుతుంది.ఇక తన బాబాయ్ అన్న మాటలకు తులసి బాధపడి ఉంటుంది అన్న ఉద్దేశంతో తనకు క్షమాపణలు చెప్పించాలని సామ్రాట్ భావించగా నేను ఆ విషయం నిన్నే మర్చిపోయాను అని తులసి సమాధానం చెప్పి లోపలికి రండి కాఫీ తాగి వెళ్ళండి అంటూ ఆహ్వానిస్తుంది.
సామ్రాట్ మరోసారి వచ్చినప్పుడు తాగుతామని చెప్పి తనని మీటింగ్ కు రమ్మని వెళ్తాడు.సామ్రాట్ నందు వాళ్ల ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేయగా తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తులసి వెళ్లడం కాస్త ఆలస్యం కావడంతో సామ్రాట్ నందుకి తులసికి ఫోన్ చేయమని చెబుతాడు.అది సమయంలోనే ఆమె లోపలికి వెళ్లడంతో తనకు కాస్త ఆలస్యమైంది క్షమించాలని చెప్పగా సామ్రాట్ నాకు ఇలా లేట్ చేస్తే నచ్చదు ఇంకొకసారి ఇలా చేయకండి అంటూ ఆమెకు చెబుతాడు. ఇక లాస్య సైతం ఆలస్యంగా రావడం పై తులసిని కోప్పడుతుంది.
ఈ విధంగా లాస్య తులసి పై కోపం తెచ్చుకోవడంతో సామ్రాట్ అడ్డుపడి నేను తనకు బాస్ తనని తిట్టే హక్కు నాకు ఉంటుంది మీకు లేదని చెబుతాడు.ఇకపోతే ఒక పని నిమిత్తం సామ్రాట్ తో పాటు నందుని వైజాగ్ రమ్మని పిలువగా తనకు వేరే పని ఉంది రాలేనని చెబుతాడు. ఇక సామ్రాట్ తులసిని ఆహ్వానించగా తులసి ఇంట్లో వారిని అడిగి తనకు ఏ విషయం చెబుతాను అని చెప్పగా నందు తులసి పై ఎంతో కోపం తెచ్చుకుంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోగా తర్వాత భాగంలో హనీ తనకు అమ్మలేదని బాధపడుతూ ఉంటుంది అయితే తులసి ఆంటీ లాంటి అమ్మ దొరికితే ఎంత బాగుంటుంది తనని అమ్మ అని పిలవాలి అని ఉందంటూ సామ్రాట్ తో చెబుతుంది.